New York Diwali: దీపావళికి న్యూయార్క్‌ గుర్తింపు.. పాఠశాలలకు సెలవు ప్రకటించిన మేయర్..

హిందవులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగను న్యూయార్క్ ప్రాధాన్యత కల్పించింది. దీపావళి పర్వదినాన న్యూయార్క్‌లో పాఠశాలలకు సెలవుదినంగా ప్రకటించారు మేయర్ ఎరిక్ ఆడమ్స్.

New York Diwali: దీపావళికి న్యూయార్క్‌ గుర్తింపు.. పాఠశాలలకు సెలవు ప్రకటించిన మేయర్..
Diwali
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 27, 2023 | 10:27 AM

హిందవులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగను న్యూయార్క్ ప్రాధాన్యత కల్పించింది. దీపావళి పర్వదినాన న్యూయార్క్‌లో పాఠశాలలకు సెలవుదినంగా ప్రకటించారు మేయర్ ఎరిక్ ఆడమ్స్. ఈ మేరకు సోమవారం నాడు అధికారిక ప్రకటన విడుదల చేశారు. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా యావత్ హిందూ సమాజం ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటుంది.

అయితే, భారతదేశంలో ఉన్నవారు మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు సైతం దీపావళిని ఘనంగా నిర్వహిస్తారు. న్యూయార్క్‌లో భారీయులు సైతం ప్రతి సంవత్సరం దీపావళిని సెలబ్రేటీ చేసుకుంటున్నారు. అయితే, తాజాగా న్యూయార్క్ రాష్ట్ర చట్ట సభ సభ్యులు దీపావళిని పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ క్షణం ఎంతో ఆనందంగా ఉందని, స్థానిక ప్రజలు సాధించిన విజయం అని పేర్కొన్నారు మేయర్ ఎరిక్. ‘దీపావళి పర్వదినాన స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సాగిన పోరాటం అసెంబ్లీ మెంబర్ జెనిఫర్ రాజ్‌కుమార్, సంఘం నాయకులకు అండగా నిలిచినందుకు గర్వపడుతున్నాను. ఈ ప్రకటనలో దీపావళి ముందుగానే వచ్చినట్లయ్యింది.’’ అని మేయర్ ఎరిక్ ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఈ బిల్లును గవర్నర్ కాథీ హోచుల్ ఆమోదిస్తారని నమ్మకం ఉందని పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..