PM Modi France Visit: పారిస్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఎయిర్‌పోర్ట్‌లో రెడ్‌ కార్పెట్‌ స్వాగతం.. వీడియో..

PM Modi France Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పాటు ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు మోదీ. పారిస్‌ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి రెడ్‌కార్పెట్‌ స్వాగతం లభించింది.

PM Modi France Visit: పారిస్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఎయిర్‌పోర్ట్‌లో రెడ్‌ కార్పెట్‌ స్వాగతం.. వీడియో..
Pm Modi France Visit
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 13, 2023 | 6:35 PM

PM Modi France Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పాటు ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు మోదీ. పారిస్‌ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి రెడ్‌కార్పెట్‌ స్వాగతం లభించింది. ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవమైన “బస్టిల్‌ డే” వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు మోదీ. ఫ్రాన్స్‌ ప్రధాని ఎలిజబెత్‌ బోర్న్‌.. ప్రధాని మోడీకి ఎయిర్‌పోర్ట్‌లో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనికులు ప్రధాని మోడీకి గౌరవ వందనంతో స్వాగతం పలికారు. దీంతోపాటు ప్రధాని మోడీకి ప్రవాసులు సైతం స్వాగతం పలికారం.. చేతిలో మువ్వెన్నెల జెండాలను చేతబూని.. ప్రధాని మోడీకి స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వారిని ఆప్యాయంగా పలకరించారు.

ఫ్రాన్స్‌తో రఫేల్‌ జెట్‌ ఫైటర్లు, సబ్‌మెరైన్ల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకుంటారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం పారిస్ చేరుకున్నారు. అనంతరం శుక్రవారం పారిస్‌లో జరిగే ఫ్రాన్స్‌ నేషనల్‌ డే పరేడ్‌లో మోడీ పాల్గొననున్నారు. యూరప్‌లో అతిపెద్ద సైనిక కవాతుగా పేరొందిన ఈ బస్టిల్ డే పరేడ్‌లో మోడీ గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. ఈ పరేడ్‌లో భారత సైనిక బృందాలు కూడా పాల్గొననున్నాయి.

కాగా.. ప్రధాని మోడీ గౌరవార్థం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు అధికారిక విందుతో పాటు ప్రైవేటు విందును కూడా ఇవ్వనున్నారు.. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, మేక్రాన్.. వివిధ అంశాలపై, పలు రంగాల్లో పరస్పర సహకారంపై సుదీర్ఘ చర్చలు జరుపుతారు. దీంతోపాటు.. ప్రధాని మోడీ ప్రవాస భారతీయులు, పలువురు ప్రముఖులతో సైతం భేటీ కానున్నారు.

Pm Modi

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..