Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులోనే ఆపేస్తాను.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
గత ఏడాది ఫిబ్రవరిలో మొదలైన రష్యా ఉక్రేయిన్ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. నేటికీ ఇరు దేశాలు తగ్గేదే లే అన్నట్లు విరుచుకుపడుతూ దాడులు కొనసాగిస్తున్నాయి. వీటి యుద్ధం వల్ల వివిధ దేశాలు కూడా ప్రభావితం అయ్యాయి.
గత ఏడాది ఫిబ్రవరిలో మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. నేటికీ ఇరు దేశాలు తగ్గేదే లే అన్నట్లు విరుచుకుపడుతూ దాడులు కొనసాగిస్తున్నాయి. వీటి యుద్ధం వల్ల వివిధ దేశాలు కూడా ప్రభావితం అయ్యాయి. అయితే తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్దంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటికి ఈ యుద్దం ఆగకపోతే.. ఒకవేళ తాను ఆ ఎన్నికల్లో గెలిచి వైట్ హౌస్ పీఠాన్ని దక్కించుకుంటే కేవలం 24 గంటల్లోనే యుద్ధాన్ని ఆపుతానని ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తాను ఏ విధంగా చర్చలు జరుపుతానో అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో శాంతి చర్చలు జరపడం తనకు చాలా సులభతరం అని పేర్కొన్నారు. కానీ ఈ చర్చలు ఇంకా ఏడాదిన్నర వరకు ప్రారంభం కావన్నారు. ఇది చాలా ఎక్కువ కాలమని దీనివల్ల ఈ యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందన్నారు. ఒకవేళ తాను 2020లో మళ్లీ అమెరికాకి అధ్యక్షుడ్ని అయి ఉంటే అసలు ఈ యుద్దమే జరిగేది కాదని తెలిపారు. 2024 ఎన్నికల సమయానికి ఈ యుద్దం ఆగకపోతే మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసి అణు యుద్ధం జరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..