Mexico Migrant Facility Fire: మెక్సికోలో దారుణం.. 40 మంది శరణార్థులు శిబిరాల్లోనే దహనం

అమెరికాలో స్థిరపడాలని వివిధ దేశాల్లోని చాలామంది ప్రజలు అనుకుంటారు. అయితే తాజాగా అమెరికాలో స్థిరపడాలనుకున్న 40 మంది వలసదారులు మెక్సికోలోని అగ్నికి ఆహుతయ్యారు.

Mexico Migrant Facility Fire: మెక్సికోలో దారుణం.. 40 మంది శరణార్థులు శిబిరాల్లోనే దహనం
Migrants Death
Follow us
Aravind B

|

Updated on: Mar 29, 2023 | 7:21 PM

అమెరికాలో స్థిరపడాలని వివిధ దేశాల్లోని చాలామంది ప్రజలు అనుకుంటారు. అయితే తాజాగా అమెరికాలో స్థిరపడాలనుకున్న 40 మంది వలసదారులు మెక్సికోలోని అగ్నికి ఆహుతయ్యారు. వివరాల్లోకి వెళ్తే ఉత్తర మెక్సికోలోని సియూడడ్ వారెజ్ నగరం అమెరికాతో సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. అయితే ఎవరైన అగ్రరాజ్యంలోకి వలసదారులుగా లేదా శరణార్థులుగా వచ్చేవారు. అయితే పలు సంబంధిత ప్రక్రియలు అధికారికంగా పూర్తయ్యేవరకు సియూడడ్ వారెజ్ లోని తాత్కలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతుంటారు. అందులో భాగంగానే మధ్య అమెరికా, దక్షిణ అమెరికా దేశాలకు చెందిన సుమారు 68 మంది కొన్నాళ్లుగా ఈ నగరంలోని వలసదారుల నిర్బంధ కేంద్రంలో ఉంటున్నారు.

అయితే వారందర్నీ అమెరికాకు కాకుండా.. తిరిగి తమ సొంత దేశాలకే పంపించాలనే ఏర్పాట్లు జరుగుతున్నాయని సోమవారం ఆ ప్రాంతంలో ప్రచారం జరిగింది. దీంతో శరణార్థుల్లో ఒక్కాసారిగా ఆందోళన మొదలైంది. వారిలో కొందరు ఆ ప్రచారంపై నిరసన వ్యక్తం చేస్తూ.. సోమవారం రాత్రి తమ కేంద్రంలోని పరుపులకు నిప్పుపెట్టారు. కానీ ఆ మంటలు క్షణాల్లోనే శిబిరం మొత్తానికీ వ్యాపించాయి. అందులో ఉన్నవారు తప్పించుకోలేక హాహాకారాలు చేశారు. మొత్తం 68 మందిలో 48 మంది తప్పించుకోగా…మరో 40 మంది ఆ శిబిరాల్లోనే ఇరుక్కుపోయారు. చివరికి మంటలు అంటుకని సజీవదహనమయ్యారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడగా..వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..