Mexico Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. 40 మంది వలసజీవుల సజీవ దహనం..

నేషనల్‌ మైగ్రేషన్‌ ఇనిస్టిట్యూట్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 40 మంది వలసజీవులు మృత్యువాత పడ్డారు. మెక్సికో.. అమెరికా సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటన మెక్సికోలో కలకలం సృష్టించింది. అనేక మంది క్షతగాత్రులయ్యారు.

Mexico Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. 40 మంది వలసజీవుల సజీవ దహనం..
Mexico Fire
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 29, 2023 | 8:28 AM

నేషనల్‌ మైగ్రేషన్‌ ఇనిస్టిట్యూట్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 40 మంది వలసజీవులు మృత్యువాత పడ్డారు. మెక్సికో.. అమెరికా సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటన మెక్సికోలో కలకలం సృష్టించింది. అనేక మంది క్షతగాత్రులయ్యారు. యూఎస్‌ మెక్సికో సరిహద్దుల్లోని వలసప్రజల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో మంటలు చెలరేగడంతో దాదాపు 40 మంది ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి. రాత్రి 10 గంటల సమయంలో శిబిరంలో మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరిగే సమయానికి దక్షిణ, సెంట్రల్‌ అమెరికాకి చెందిన మొత్తం 68 మంది శిబిరంలో ఉన్నట్టు అధికారులు ప్రకటించారు.

అమెరికా బోర్డర్‌కు దగ్గరలోని ఇమిగ్రేషన్‌ డిటెన్షన్‌ సెంటర్లలో ఈ దారుణం జరిగింది. మెక్సికోలోని నేషనల్‌ మైగ్రేషన్‌ ఇనిస్టిట్యూట్‌… వలసదారుల రెగ్యులేషన్‌ బాధ్యతలు నిర్వర్తించే ప్రభుత్వ సంస్థ. అమెరికాకు వెళ్లడానికి జనం గుమిగూడినప్పుడు, ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న వారిలో అత్యధిక మంది వెనిజులాకి చెందన వారిగా భావిస్తున్నారు.

వలసదారుల ప్రమాదం జరిగిన వెంటనే భారీగా పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు….అంబులెన్స్‌లలో బాధితులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియరాలేదు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు జరుగుతోందని ఐఎన్‌ఎం వెల్లడించింది. గాయపడ్డవారిని నాలుగు స్థానిక ఆసుపత్రుల్లో చేర్చినట్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..