Afghanistan: మరోసారి నెత్తురోడిన ఆప్ఘనిస్థాన్‌.. పాఠశాలపై ఆత్మాహుతి బాంబు దాడి.. 53 మంది దుర్మరణం..

ఆప్ఘనిస్థాన్‌ మరోసారి నెత్తురోడింది. కాబూల్‌ని షాహిద్‌ మజారీ రోడ్‌లోని పుల్-ఎ-సుఖ్తా ప్రాంతానికి సమీపంలోని పాఠశాలలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 53 మందికి పైగా దుర్మరణం చెందారు.

Afghanistan: మరోసారి నెత్తురోడిన ఆప్ఘనిస్థాన్‌.. పాఠశాలపై ఆత్మాహుతి బాంబు దాడి.. 53 మంది దుర్మరణం..
Afghanistan
Follow us

|

Updated on: Oct 03, 2022 | 7:51 PM

ఆప్ఘనిస్థాన్‌ మరోసారి నెత్తురోడింది. కాబూల్‌ని షాహిద్‌ మజారీ రోడ్‌లోని పుల్-ఎ-సుఖ్తా ప్రాంతానికి సమీపంలోని పాఠశాలలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 53 మందికి పైగా దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఓ పాఠశాల తరగతి గదిలో ఆత్మహుతి బాంబు పేలుడు జరగగా.. 46 మంది బాలికలు, మహిళలు సహా.. 53 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాబూల్‌లోని పీడీ-6 ప్రాంతంలోని పశ్చిమాన మధ్యాహ్నం 2 గంటలకు ఈ పేలుడు సంభవించినట్లు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఖామా ప్రెస్ నివేదించింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌కు పశ్చిమాన షాహిద్ మజారీ ప్రాంతంలో ఆత్మహుతి దాడి జరిగినట్లు AFP న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఇదిలాఉంటే.. ఆప్ఘనిస్థాన్‌లో కొన్ని రోజుల నుంచి బాంబు దాడులు పెరిగాయి. సెప్టెంబరు 30 ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఒక విద్యాసంస్థలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో కనీసం 100 మంది పిల్లలు మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధానిలోని షియా ప్రాంతంలోని విద్యా కేంద్రంపై ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.

ఆఫ్ఘనిస్తాన్‌లోని మైనారిటీ షియా కమ్యూనిటీ ప్రజలు ఎక్కువగా నివసించే కాబూల్‌లోని దస్తీ బార్చి పరిసరాల్లో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. కాగా.. తాలిబాన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో హింస మళ్లీ పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..