Fitness Goal: 45 ఏళ్ల వయసులో18 ఏళ్ల యువకుడి లాంటి శరీరం.. ప్రత్యేకమైన మిషన్‌తో వ్యాపారవేత్త కసరత్తులు…

బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు ఫిట్ నెస్ కోసం జిమ్ లకు వెళ్లి వ్యాయామం చేస్తుంటారు. నెలల తరబడి బరువు తగ్గేందుకు కసరత్తులు చేస్తుంటారు. అయితే అమెరికాకు చెందిన ఓ 45 ఏళ్ల వ్యాపారవేత్త 18 ఏళ్ల యువకుడి లాంటి ఫిట్ నెస్ కోసం ఏడాదికి ఏకంగా 2 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు.

Fitness Goal: 45 ఏళ్ల వయసులో18 ఏళ్ల యువకుడి లాంటి శరీరం.. ప్రత్యేకమైన మిషన్‌తో వ్యాపారవేత్త కసరత్తులు...
Bryan Johnson
Follow us
Aravind B

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 08, 2023 | 11:29 AM

బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు ఫిట్ నెస్ కోసం జిమ్ లకు వెళ్లి వ్యాయామం చేస్తుంటారు. నెలల తరబడి బరువు తగ్గేందుకు కసరత్తులు చేస్తుంటారు. అయితే అమెరికాకు చెందిన ఓ 45 ఏళ్ల వ్యాపారవేత్త 18 ఏళ్ల యువకుడి లాంటి ఫిట్ నెస్ కోసం ఏడాదికి ఏకంగా 2 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు అతను ఫిట్ నెస్ కోసం వినియోగిస్తున్న మిషన్ ను ఎలా ఉపయోగిస్తున్నాననే ఓ వీడియోను కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కాలిఫోర్నియాలోని బ్లూ ప్రింట్ సీఈఓ అయిన బ్రయాన్ జాన్సన్ అతిగా తినేవాడు. ఆ తర్వాత ఫిట్ నెస్  లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో తన వయస్సుని 18 ఏళ్ల యువకుని శరీరంగా మార్చుకునేందుకు ప్రత్యేకంగా ఓ మిషన్ ను కొనుగోలు చేశాడు.

దాన్ని ఎలా వాడాలో వివరిస్తూ ఆ మిషిన్ పెట్టుకుని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. తన పొట్టకు ఆ పరికరం బెల్డుని చుట్టుకుని ఓ బెంచ్ పై పడుకున్నాడు.ఆ మిషన్ మరో స్రీన్ కు అనుసంధానమై ఉంది. అది ఎలా పనిచేస్తుందో చూపించడానికి దాన్ని గరిష్ఠ స్థాయికి పెంచాడు. దీన్ని 100 శాతం గరిష్ఠ స్థాయికి పెంచానని మీరు కూడా ఇలా ఈ పరికరాన్ని ఈ స్థాయిలో ప్రారంభించకూడదని చెప్పారు. ఇలా చేస్తే కడుపు మొత్తం బయటకు వస్తున్నట్లు అనిపిస్తుందని తెలిపారు. ఈ మిషన్ పెట్టుకుంటే 30 నిమిషాల్లో 20 వేల సార్లు సిట్ అప్స్ చేసినట్లేనని తెలిపారు. అయితే ఈ మిషన్ ను వాడుతున్నప్పటి నుంచి జాన్సన్ ప్రతిరోజు జాన్సర్ కఠినమైన డైట్ చేస్తున్నారు. అలాగే రోజు అతని శరీర బరువు, కొవ్వు, గ్లూకోస్ లెవెల్స్, హార్ట్ రేట్ లాంటి వన్నీ కొలుస్తారు. ఆయన ప్రతిరోజు పొద్దున్నే 5 గంటలకు లేచి.. గ్రీన్ జూస్ ను తీసుకుంటారు. ఆ తర్వాత గంట సేపు వ్యాయామం చేస్తారు. ఆ తర్వాత ఆ రోజు మొత్తంలో ఆయన కేవలం 1,977 కేలరీల ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. దీన్ని వాడటం వల్ల సుమారు 5 ఏళ్లు వయస్సు తగ్గించుకోగలిగానని జాన్సన్ పేర్కొన్నారు. ఈ మిషన్ ను వాడటం మొదలుపెట్టాక దీన్ని వాడకుండా ఉండలేకపోతున్నానని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..