Shortest Bodybuilder: పెళ్లి చేసుకున్న ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్.. అమ్మాయి ఎవరంటే!
"నవ్విన నాప చేను పండింది" అన్న సామెతను నిజం చేశాడు ఓ వ్యక్తి.. తనను చూసి నవ్వే ప్రతి ఒక్కరికి సవాల్ విసిరి.. వారితోనే శభాష్ అనిపించుకున్నాడు. శాపంగా మారిన శరీర దారుఢ్యాన్ని సైతం జయించాడు.
“నవ్విన నాప చేను పండింది” అన్న సామెతను నిజం చేశాడు ఓ వ్యక్తి.. తనను చూసి నవ్వే ప్రతి ఒక్కరికి సవాల్ విసిరి.. వారితోనే శభాష్ అనిపించుకున్నాడు. శాపంగా మారిన శరీర దారుఢ్యాన్ని సైతం జయించాడు. దేశవ్యాప్తంగా ప్రశంసలతో పాటు పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచాడు అత్యంత పొట్టి బాడీబిల్డర్.. అతని పేరే ప్రతీక్ విఠల్ మోహితే. మహారాష్ట్రకు చెందిన ప్రతీక్ ఎత్తు కేవలం 3.4 అడుగులు మాత్రమే. జయా అనే మరో షార్ట్ అమ్మాయిని అతను పెళ్లాడి ఆదర్శంగా నిలిచాడు. ఆమె ఎత్తు 4 ఫీట్ల 2 ఇంచులు మాత్రమే. మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో ఆ వివాహం జరిగింది. హల్దీ సెర్మనీకి సంబంధించిన వీడియోను ప్రతీక్ తన సోషల్ మీడియాలో పోస్ట్ తన సంతోషం వ్యక్తం చేశాడు.మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల బాడీబిల్డిర్ ప్రతీక్ విఠల్ మోహితే.. 22 ఏళ్ల జయను పెళ్లాడాడు. నాలుగేళ్ల క్రితం ఈ ఇద్దరికీ పరియమైంది. ఆ తర్వాత ఆ ఇద్దరూ ఎంగేజయ్యారు. ప్రతీక్ తన పెళ్లి ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. పెళ్లి కుమారుడి దుస్తుల్లో ఓ వాహనంపై నిలుచుని డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా పోస్టు చేశారు. తన భార్యతో కలిసిన మరో ఫోటోను అప్‌లోడ్ చేశాడు. హల్దీ సెర్మనీ చెందిన ఓ వీడియో కూడా పోస్టు చేశాడు.ప్రతీక్ తన బాడీబిల్డింగ్ కేరీర్‌ను 2012లో మొదలుపెట్టాడు. 2016లో తొలిసారి కాంపిటీషన్‌లో పాల్గొన్నాడు. 2021లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను కూడా సాధించాడు. పురుషుల విభాగంలో షార్టెస్ట్ కాంపిటీటివ్ బాడీబిల్డర్ టైటిల్ ప్రతీక్ దక్కించుకున్నాడు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్టుతో ప్రపంచ స్థాయికి ఎదగాడు. జయను చూసి వెంటనే నచ్చేసినట్లు తెలిపాడు. ఆమె కూడా తనను ఇష్టపడినట్లు చెప్పాడు. తన ఫిజిక్ జయను ఆకర్షించిందన్నాడు. ఓ మంచి ఉద్యోగంలో చేరి జయను బాగా చూసుకోవాలన్న తపనను ప్రతీక్ ఎక్స్‌ప్రెస్ చేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో