Snakes Raising: పాముల పెంపకంతో కోట్లు సంపాదిస్తున్న గ్రామస్తులు.. వీడియో వైరల్.

Snakes Raising: పాముల పెంపకంతో కోట్లు సంపాదిస్తున్న గ్రామస్తులు.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Aug 16, 2023 | 4:22 PM

సాధారణంగా గ్రామాలలో వ్యవసాయం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, పశువుల పెంపకం చేసి డబ్బులు సంపాదిస్తారు. అలాకాకుండా పాముల పెంపకం చేసి డబ్బులు సంపాదిస్తున్నారని తెలిస్తే భయంతో గజగజా వణుకుతారు.. వాస్తవానికి పామును చూడగానే పారిపోతారు.. లేదంటే చంపేస్తారు.. అయితే పాములను పెంచి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న దేశం ఒకటి ఉంది. అదే చైనా..

సాధారణంగా గ్రామాలలో వ్యవసాయం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, పశువుల పెంపకం చేసి డబ్బులు సంపాదిస్తారు. అలాకాకుండా పాముల పెంపకం చేసి డబ్బులు సంపాదిస్తున్నారని తెలిస్తే భయంతో గజగజా వణుకుతారు.. వాస్తవానికి పామును చూడగానే పారిపోతారు.. లేదంటే చంపేస్తారు.. అయితే పాములను పెంచి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న దేశం ఒకటి ఉంది. చైనాలోని జిసికియావో గ్రామంలోని ప్రజలు పాములను పెంచుతూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ గ్రామంలోని ప్రజల ప్రధాన ఆదాయ వనరు పాముల పెంపకం. దీని కారణంగా ఈ గ్రామాన్ని స్నేక్ విలేజ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా పాముల పెంపకానికి ప్రసిద్ధి చెందిన ఈ గ్రామంలోని దాదాపు ప్రతి ఇంట్లో పాములను పెంచుతారు. ఈ గ్రామ జనాభా సుమారు వెయ్యి మంది.. అయితే ప్రతి వ్యక్తి 30వేల పాములను పెంచుతాడు. తమ ఇళ్లనే పాముల పెంపకానికి ఆవాసంగా చేసుకుంటాడు. ఇక్కడ ప్రతి ఏటా కోటి పాములు అమ్మకం జరుగుతాయని తెలుస్తోంది.

నిజానికి పాములను పెంచుతున్నారు కదా.. ఇవన్నీ విషరహితమైనవనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీటిలో చాలావరకు ఎక్కువ విషం ఉన్న పాములు కూడా ఉన్నాయని తెలుస్తోంది. పాముల మాంసంతో పాటు వాటి శరీర భాగాలను కూడా అమ్ముతూ బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఒక లీటరు విషం ఏకంగా 3.5 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...