Viral Video: అయ్యో పాపం దొంగ.. బంగారం అనుకుని గొలుసు లాక్కెళ్తే ఇంత షాక్ ఇస్తే ఎలా..?
కంచుమోగినట్టు కనకంబు మోగునా.. అన్నట్టు బంగారాన్ని మించి మెరిసిపోతోంది రోల్డ్ గోల్డ్. ధర తక్కువ, మోడల్స్ ఎక్కువ. పెరుగుతున్న ధరల నేపధ్యంలో బంగారం అందరూ ధరించలేరు. రోల్డ్ గోల్డ్ అయితే అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. దాంతో సామాన్యులు ఈ రోల్డ్‌గోల్డ్ నగలతో తృప్తి పడుతుంటారు. తాజాగా ఓ అత్తా కోడలు చక్కగా ముస్తాబై ఫంక్షన్‌కి వెళ్తున్నారు. మెడలో గొలుసు తళతళా మెరుస్తుండటంతో ఓదొంగ కన్ను
కంచుమోగినట్టు కనకంబు మోగునా.. అన్నట్టు బంగారాన్ని మించి మెరిసిపోతోంది రోల్డ్ గోల్డ్. ధర తక్కువ, మోడల్స్ ఎక్కువ. పెరుగుతున్న ధరల నేపధ్యంలో బంగారం అందరూ ధరించలేరు. రోల్డ్ గోల్డ్ అయితే అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. దాంతో సామాన్యులు ఈ రోల్డ్‌గోల్డ్ నగలతో తృప్తి పడుతుంటారు. తాజాగా ఓ అత్తా కోడలు చక్కగా ముస్తాబై ఫంక్షన్‌కి వెళ్తున్నారు. మెడలో గొలుసు తళతళా మెరుస్తుండటంతో ఓదొంగ కన్ను దానిపైన పడింది. వెనకాలే వెళ్లి ఆ గొలుసులాక్కెళ్లిపోయాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. విస్సన్నపేట నుంచి కొత్తపేటలో ఫంక్షన్‌కి వెళ్తున్నారు అత్తాకోడలు. ఇంతలో దొంగ వెనకాలే వచ్చి మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిపోయాడు. బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దొంగ కొట్టేసింది రోల్డ్‌గోల్డ్ గొలుసు. పాపం ఈ విషయం తెలిసిన తర్వాత ఆ దొంగ పరిస్థితి ఏంటో తెలియదు కానీ, పోయింది బంగారం కాదుకదా అని ఆ మహిళలు వదిలేయలేదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని, తమది నకిలీ బంగారం కాబట్టి సరిపోయింది.. అదే నిజమైన బంగారం అయితే.. ఆ పెనుగులాటలో ప్రాణం పోతే పరిస్థితి ఏంటని బాధితురాలు అంటోంది. స్థానికంగా ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...