Rare Diamond: వజ్రం లోపల వజ్రాన్ని ఎప్పుడైనా చూశారా.. అరుదైన వజ్రం.. మనదేశంలోనే

Rare Diamond: వజ్రం లోపల వజ్రాన్ని ఎప్పుడైనా చూశారా.. అరుదైన వజ్రం.. మనదేశంలోనే

Anil kumar poka

|

Updated on: Apr 21, 2023 | 9:59 PM

ప్రపంచంలోనే అరుదైన పింక్‌, బ్లాక్‌, పసుపు రంగు వజ్రాల గురించి మనకు తెలుసు. వీటన్నిటినీ మించి అరుదైన వజ్రం మనదేశంలో దొరికింది. అవును, వజ్రం లోపల మరో వజ్రం ఉండటం ఎప్పుడైనా చూశారా?

ప్రపంచంలోనే అరుదైన పింక్‌, బ్లాక్‌, పసుపు రంగు వజ్రాల గురించి మనకు తెలుసు. వీటన్నిటినీ మించి అరుదైన వజ్రం మనదేశంలో దొరికింది. అవును, వజ్రం లోపల మరో వజ్రం ఉండటం ఎప్పుడైనా చూశారా? అదేంటి వజ్రం లోపల వజ్రం ఉండటం అనుకుంటున్నారా. నిజంగానే అలాంటి వజ్రం మన ఇండియాలోనే ఉంది. గుజరాత్ లోని సూరత్ లో వి.డి గ్లోబల్ అనే వజ్రాల కంపెనీకి దొరికింది. ఆ వజ్రం లోపలున్న వజ్రం కూడా అటూఇటూ కదులుతున్నట్లు, స్పష్టంగా కనిపిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ 0.329 క్యారట్ల వజ్రానికి బీటింగ్‌ హార్ట్‌ అని పేరు కూడా పెట్టారు. గత ఏడాది అక్టోబర్‌ లో వజ్రాల గనుల తవ్వకాల్లో ఇది దొరికింది. అయితే ఇది అరుదైన వజ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ది జెమ్‌ అండ్‌ జ్యుయెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రొమోషన్‌ కౌన్సిల్‌ దానిపై మరింత లోతుగా అధ్యయనం చేసింది. ఆప్టికల్, ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్స్‌ ద్వారా విశ్లేషణలు జరిపి 2019లో సైబీరియాలో లభించిన వజ్రం మాదిగానే బీటింగ్‌ హార్ట్‌ కూడా ఉందని తేల్చింది.అప్పట్లో సైబీరియాలో లభించిన ఈ వజ్రంలో వజ్రం 80 కోట్ల ఏళ్ల నాటిదని, దాని విలువ అమూల్యమని అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ వజ్రానికి మత్రోష్కా అని పేరు పెట్టారు. వజ్రాలపై అధ్యయనం చేసే డి బీర్స్‌ గ్రూప్‌కు చెందిన నిపుణురాలు సమంతా సిబ్లీ గత 30 ఏళ్లలో బీటింగ్‌ హార్ట్‌లాంటి అరుదైన వజ్రాన్ని చూడలేదని తెలిపారు. అసలు ఇంతకీ ఈ వజ్రం ఎలా ఏర్పడిందో అనే దానిపై కూడా అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 21, 2023 09:59 PM