School: ఈ బడికి వెళ్తే పుస్తకాలే కాదు..హెల్మెట్లు కూడా పెట్టుకోవాలి. మా స్కూల్ పట్టించుకోండి అయ్యా..

School: ఈ బడికి వెళ్తే పుస్తకాలే కాదు..హెల్మెట్లు కూడా పెట్టుకోవాలి. మా స్కూల్ పట్టించుకోండి అయ్యా..

Anil kumar poka

|

Updated on: Aug 23, 2023 | 10:11 PM

సాధారణంగా స్కూలుకి వెళ్లే పిల్లలు చాకలి మూటలా బ్యాగునిండా పుస్తకాలతో వెళ్లడం చూసాం. కానీ ఈ పాఠశాలకు వెళ్లే విద్యార్ధులు పుస్తకాలే కాదు హెల్మెట్లు కూడా పెట్టుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే పాఠశాల శిధిలావస్థకు చేరడంతో ఎప్పుడు కుప్పకూలి నెత్తిమీద పడుతుందోనని భయంతో విద్యార్ధులు హెల్మెట్లు ధరించి స్కూలుకి వెళ్తున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

సాధారణంగా స్కూలుకి వెళ్లే పిల్లలు చాకలి మూటలా బ్యాగునిండా పుస్తకాలతో వెళ్లడం చూసాం. కానీ ఈ పాఠశాలకు వెళ్లే విద్యార్ధులు పుస్తకాలే కాదు హెల్మెట్లు కూడా పెట్టుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే పాఠశాల శిధిలావస్థకు చేరడంతో ఎప్పుడు కుప్పకూలి నెత్తిమీద పడుతుందోనని భయంతో విద్యార్ధులు హెల్మెట్లు ధరించి స్కూలుకి వెళ్తున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెనుమూరు మండలం సన్యాసి పల్లిలో విద్యార్థులు పాఠశాలకు హాజరు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనం ఎప్పుడు కూలిపోతుందోనన్న ఆందోళనతో వినూత్న నిరసనకు దిగారు విద్యార్థులు. హెల్మెట్లు ధరించి పాఠశాలకు హాజరయ్యారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాన్ని పునర్‌నిర్మించాలని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాకపోవడంతో హెల్మెట్ పెట్టుకుని పాఠశాలకు హాజరయ్యారు. ఐదేళ్లుగా శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలో చెట్ల కిందే క్లాసులు నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులు.
ఈ నేపధ్యంలో ఆ గ్రామంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. దాంతో విద్యార్ధులు తమ సమస్యను ఇలా వినూత్నంగా అధికారి దృష్టికి తీసుకెళ్లారు. తమ పాఠశాల నూతన భవన నిర్మాణం చేపట్టాలని డిప్యూటీ సీఎం కి వినతిపత్రం అందజేసారు విద్యార్ధులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...