Adulterated Ghee: కల్తీ నెయ్యిని కనిపెట్టడం ఇంత ఈజీనా..! నగరంలో కల్తీనెయ్యి గుట్టురట్టు..
కల్తీ..కల్తీ..కల్తీ.. ఏ వస్తువు కొనాలన్నా కల్తీ.. ఇదొక భూతంలా తయారైంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ కల్తీ నెయ్యి వ్యాపరి గుట్టు రట్టు చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. మోండామార్కెట్‌లోని మారుతి వీధికి చెందిన పెరుమాళ్ నాచి, ముత్తు నవీన్ అనే వ్యక్తులు కల్తీ నెయ్యి దందాకు తెరలేపారు. వీరు వాస్తవానికి ఓ చిన్న దుకాణంలో సైకిళ్లకు పంచర్లు వేస్తుంటారు. వెనుక మాత్రం కల్తీ నెయ్యి తయారు చేస్తుంటారు. పామాయిల్, డాల్డా కలిపి నెయ్యి తయారుచేసి తక్కువ ధరకే
కల్తీ..కల్తీ..కల్తీ.. ఏ వస్తువు కొనాలన్నా కల్తీ.. ఇదొక భూతంలా తయారైంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ కల్తీ నెయ్యి వ్యాపరి గుట్టు రట్టు చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. మోండామార్కెట్‌లోని మారుతి వీధికి చెందిన పెరుమాళ్ నాచి, ముత్తు నవీన్ అనే వ్యక్తులు కల్తీ నెయ్యి దందాకు తెరలేపారు. వీరు వాస్తవానికి ఓ చిన్న దుకాణంలో సైకిళ్లకు పంచర్లు వేస్తుంటారు. వెనుక మాత్రం కల్తీ నెయ్యి తయారు చేస్తుంటారు. పామాయిల్, డాల్డా కలిపి నెయ్యి తయారుచేసి తక్కువ ధరకే పూజాసామాగ్రి దుకాణాలకు, ఆలయాలకు సరఫరా చేస్తున్నారు. పక్కాసమాచారంతో రంగంలోకి దిగిన నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు చేశారు. ఈ క్రమంలో నకిలీ నెయ్యి దందా గుట్టురట్టయింది. నిందితులను అదుపులోకి తసుకున్నారు. అయితే కల్తీనెయ్యిని గుర్తించడం ఎలాగో తెలుసుకుంటే ఇలా మోసపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కల్తీ నెయ్యిని గుర్తించడం సులభం. నెయ్యిని కరిగించి ఒకసారి ఆ రంగుని పరిశీలించండి. ఒకవేళ నెయ్యి గోధుమ రంగులోకి మారితే అది స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం. అలా కాకుండా నెయ్యి పసుపచ్చ రంగులోకి మారితే కల్తీ నెయ్యి అని అర్థం. అలాగే అరిచేతిలో నెయ్యి రాసుకుంటే చిన్న చిన్న గింజలుగా ఏర్పడితే అది కల్తీ నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి అయితే అరిచేతిలో రాసినప్పుడు పూర్తిగా కరిగిపోతుంది. ఇలా చిన్న చిన్న చిట్కాలతో కల్తీ నెయ్యిని గుర్తించవచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...