Junk Food: ప్రెగ్నెంట్ లేడీస్ పిజ్జాలు.. బర్గర్లు తింటే ఎం జరుగుతుంది..?

మీకు పిజ్జా, బర్గర్లు, ప్యాకేజ్‌ ఫుడ్స్‌ అంటే చాలా ఇష్టమా.. అయితే మీకో బ్యాడ్‌ న్యూస్‌‌‌‌ జంక్ ఫుడ్‌, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల బీపీ, షుగర్, గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. తాజాగా గర్భిణులు హెల్తీ ఫుడ్ తీసుకోకుండా అతిగా శుద్ధి చేసిన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తింటే,

Junk Food: ప్రెగ్నెంట్ లేడీస్ పిజ్జాలు.. బర్గర్లు తింటే ఎం జరుగుతుంది..?

|

Updated on: Jul 15, 2023 | 8:25 PM

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి, నేచురల్ ఫుడ్స్‌ను రసాయన భాగాలుగా విడగొట్టి తయారు చేసే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్‌. ఈ ప్రక్రియ సహజ ఆహారాల స్వభావాన్ని నాశనం చేస్తుంది. అంటే ఆహార పదార్థాల్లోని ఫైబర్ కంటెంట్‌ను తీసేసి, వాటికి కృత్రిమ చక్కెరలు, కొవ్వులు లేదా సాల్ట్స్ యాడ్ చేస్తారు. తర్వాత వాటికి ఎమల్సిఫైయర్లు, స్టెబిలైజర్లు, కలరింగ్ ఏజెంట్లు, విభిన్న ఫ్లేవర్స్ యాడ్ చేసి ఆకర్షణీయంగా మారుస్తారు. UPFలను ఎక్కువగా తీసుకునే గర్భిణులకు పుట్టే పిల్లల తల చుట్టుకొలత, తొడ ఎముక పొడవు ఎక్కువగా ఉంటున్నట్లు బ్రెజిల్ కేంద్రంగా నిర్వహించిన తాజా అధ్యయనం గుర్తించింది. బ్రెజిల్‌లో 417 మంది తల్లుల ఆహారపు అలవాట్లు, వారి పిల్లలపై ఈ అలవాట్ల ప్రభావాన్ని పరిశోధనలో విశ్లేషించారు. అధ్యయనంలో భాగమైన వారి సగటు వయసు 24.7 సంవత్సరాలు కాగా, వీరిలో దాదాపు సగం మంది తల్లులు మొదటిసారి గర్భం ధరించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం, గర్భధారణ సమయంలో UPFల వినియోగం మానేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Follow us
Latest News