Car Number Plate: కారు నంబర్‌ ప్లేట్ కోసం వందల కోట్లు.. గిన్నిస్ రికార్డ్.. ధర ఎంతంటే.?

Car Number Plate: కారు నంబర్‌ ప్లేట్ కోసం వందల కోట్లు.. గిన్నిస్ రికార్డ్.. ధర ఎంతంటే.?

Anil kumar poka

|

Updated on: Apr 16, 2023 | 9:17 AM

కారు కొనాలనుకుంటే 10 లక్షల వరకు పెట్టుబడి పెడితే మంచి కారు వస్తుంది. ఇక కోట్లు పెడితే లగ్జరీ కార్లు వస్తాయి. కార్ల కోసం ఇలా 10,20 లక్షలు ఖర్చు చేయాలంటేనే చాలా మందికి మనసొప్పదు. అయితే..

కారు కొనాలనుకుంటే 10 లక్షల వరకు పెట్టుబడి పెడితే మంచి కారు వస్తుంది. ఇక కోట్లు పెడితే లగ్జరీ కార్లు వస్తాయి. కార్ల కోసం ఇలా 10,20 లక్షలు ఖర్చు చేయాలంటేనే చాలా మందికి మనసొప్పదు. అయితే ఇక్కడ ఒక కారు నంబర్ కొనుగోలు చేసేందుకే వందల కోట్లు ఖర్చు చేశారు. ఏంటీ నంబర్ కోసమే కోట్లు వెచ్చించడం ఏంటి? అనుకుంటున్నారా..! ఇది నిజమే మరి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌‌గా గిన్నిస్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఇటీవలి కాలంలో ఇలా కారు నంబర్ ప్లేట్స్ కోసం భారీ మొత్తం పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. VIP కారు నంబర్ P7 అనే దాని కోసం ఏకంగా 122 కోట్ల 60 లక్షల రూపాయలు చెల్లించారు. ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో కారు నంబర్ ఫ్లేట్ కోసం ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ఛారిటీ వేలం కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించగా.. 1 బిలియన్ మీల్స్ ఎండోమెంట్ క్యాంపెయిన్ కోసం కారు నంబర్ ప్లేట్ వేలం వేయడం జరిగింది. దీంట్లోనే P7 అనే నంబర్ కోసం 122 కోట్లకుపైగా ఖర్చు చేశారు. ఈ కారు నంబర్ ప్లేట్ కోసం వచ్చిన డబ్బులు.. ఛారిటీకి వెళ్తాయి. ఈ వేలం నిర్వహించింది యూఏఈ ప్రభుత్వం. రంజాన్ ఇఫ్తార్ కోసం యాక్షన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఇతర నంబర్ ప్లేట్స్‌ను వేలం వేశారు. AA19, AA22, AA80, X36, O71, W78, H31, Z37, Z57, N41 ఇలా పలు కార్ల నంబర్లను వేలం వేశారు. కొన్ని స్పెషల్ నంబర్లను కూడా వేలం వేశారు. వీటిల్లో Y900, Q22222 వంటి నంబర్లు కూడా ఉన్నాయి. చివరిగా 2008లో అబుదాబిలో నిర్వహించిన వేలంలో కారు నంబర్ ప్లేట్ 52.2 మిలియన్ డాలర్ల దిర్హమ్స్ ధర పలికింది. మన కరెన్సీలో దీని విలువ 116 కోట్ల రూపాయలు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రేటు పలికింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 16, 2023 09:17 AM