Airplanes floating: గాల్లో ఉండాల్సిన విమానాలు.. నీటిలో తేలితే ఎలా.? నీటిలో తేలుతున్న విమానాలు.
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కుండపోతగా కురవడంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. ఆకస్మిక వరదలతో రోడ్లు నదులను తలపించాయి. ఇక దేశంలో ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయమైన ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టు (Frankfurt airport) స్విమ్మింగ్‌పూల్‌ను తలపిస్తోంది. గంటల వ్యవధిలోనే కురిసిన భారీ వానతో విమానాశ్రయంలో రన్‌వేలను వరద నీరు ముంచెత్తడంతో
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కుండపోతగా కురవడంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. ఆకస్మిక వరదలతో రోడ్లు నదులను తలపించాయి. ఇక దేశంలో ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయమైన ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టు (Frankfurt airport) స్విమ్మింగ్‌పూల్‌ను తలపిస్తోంది. గంటల వ్యవధిలోనే కురిసిన భారీ వానతో విమానాశ్రయంలో రన్‌వేలను వరద నీరు ముంచెత్తడంతో విమానాలు తేలియాడుతున్నట్లు కన్పిస్తున్నాయి. దీంతో అధికారులు విమాన సర్వీసులను రద్దుచేశారు. ఫ్రాంక్‌ఫర్ట్‌కు వచ్చే విమానాలను ఇతర నగరాలకు మళ్లించారు. భారీగా వర్షం కురుస్తుండటంతో వేలాది మంది విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. ఇక టేకాఫ్ అవడానికి సిద్ధమైన లుఫ్తాన్సా విమానం ఒక్కసారిగా వచ్చిన వరదతో నిలిచిపోయింది. దీంతో కొన్నిగంటల పాటు ప్రయాణికులు అందులోనే ఉండిపోయారు. ఇక నగరంలోని రోడ్లన్నీ నీట మునగడంతో వాహనదారుల తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని మళ్లిస్తున్నారు. కాగా, మరికొన్ని గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని లోకల్ వెదర్ సర్వీస్ విభాగం వెల్లడించింది. స్వల్ప వ్యవధిలోనే చదరపు మీటర్‌కు 25 నుంచి 40 లీటర్ల వర్షం కురుస్తుందని తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...