అద్భుత దృశ్యం.. ఎడారిలో చేపల వర్షం.. జనమంతా షాక్ !!

అద్భుత దృశ్యం.. ఎడారిలో చేపల వర్షం.. జనమంతా షాక్ !!

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Mar 11, 2023 | 9:45 AM

ఆస్ట్రేలియాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షపు చుక్కే అరుదైన ఆ ప్రాంతంలో.. ఆకాశం నుంచి ఏకంగా చేపల వర్షం కురిసింది. అది చూసి జనాలు షాక్ అయ్యారు.

ఆస్ట్రేలియాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షపు చుక్కే అరుదైన ఆ ప్రాంతంలో.. ఆకాశం నుంచి ఏకంగా చేపల వర్షం కురిసింది. అది చూసి జనాలు షాక్ అయ్యారు. దేవుడు ఆశీర్వాద ఫలితమే ఈ చేపల వర్షం అంటూ మురిసిపోయారు. చేపల వర్షంతో ఎటు చూసినా రహదారులన్నీ చేపలతో నిండిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియాలోని కేథరీన్‌కుు నైరుతి దిశలో దాదాపు 560 కిలోమీటర్ల దూరంలో టనామీ ఏడారి ఉంది. ఆ ప్రాంతం ఉత్తర అంచులో ఉన్న లాజమాను అనే పట్టణంలో భారీ వర్షం కురిసింది. ఆ వర్షంతోపాటే.. చేపలు ఆకాశం నుంచి భారీ సంఖ్యలో పడ్డాయి. అది చూసి లాజామాను పట్టణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తొలుత వర్షం మాత్రమే పడుతుందని భావించగా.. కాసేపట్లోనే భారీ స్థాయిలో ఆకాశం నుంచి చేపలు పడటం మొదలైంది. కొద్దిసేపు చేపల వర్షం కురిసిందని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.కోటి ధర పలికే అరుదైన పాము.. ఎక్కడుందంటే ??

థమ్స్‌అప్‌తో పానీపూరీ చేస్తున్న వీధివ్యాపారి.. టేస్ట్‌ అదిరింది అంటున్న నెటిజన్లు

జై కొట్టిన 16వేల మంది.. వరల్డ్ బిగ్‌ స్క్రీన్‌ పై RRR

Allu Arjun: తెలుగోడి సత్తా.. సౌత్‌ ఇండియా మొత్తంలో ఒకే ఒక్క హీరో అల్లు అర్జున్

Salaar: రిలీజ్ కాకముందే డార్లింగ్ దిమ్మతిరిగే రికార్డ్‌ !!