Viral Video: అమ్మ హోమ్ వర్క్ చేయమంటుంది.. నన్ను అనాధాశ్రమంలో చేర్పించడి..!
ఒకప్పుడు అల్లరి చేస్తే చిన్న పిల్లలని భయపెట్టడానికి పోలీసులకు ఇచ్చేస్తామని అనేవారు. ఇప్పుడు కాలం మారింది. చిన్నారులే ఏ మాత్రం భయం లేకుండా నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి తల్లిదండ్రుల మీద కంప్లైట్ చేస్తున్నారు. తాజాగా ఓ బాలుడు హోమ్ చేయాలని చెప్పిన తన తల్లిపై కోపంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది.
ఒకప్పుడు అల్లరి చేస్తే చిన్న పిల్లలని భయపెట్టడానికి పోలీసులకు ఇచ్చేస్తామని అనేవారు. ఇప్పుడు కాలం మారింది. చిన్నారులే ఏ మాత్రం భయం లేకుండా నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి తల్లిదండ్రుల మీద కంప్లైట్ చేస్తున్నారు. తాజాగా ఓ బాలుడు హోమ్ చేయాలని చెప్పిన తన తల్లిపై కోపంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని చాంగ్‌కింగ్‌కు చెందిన ఓ పదేళ్ల బాలుడిని హోం వర్క్ చేయడం లేదని తల్లి మందలించింది. దాంతో ఆ బాలుడు అలిగి తల్లిపై ఫిర్యాదు చేసేందుకు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ పోలీసులతో మా అమ్మ రోజూ హోమ్ వర్క్ చేయమని చెబుతోంది. నేను మా ఇంట్లో ఉండలేను, నన్ను అనాథాశ్రమంలో చేర్పించండి అంటూ ఏడుస్తూ పోలీసులకు చెప్పాడు. దాంతో షాక్ తిన్న పోలీసులు బాలుడిని కూర్చోబెట్టి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. మాటల్లో పెట్టి ఆ బాలుడినుంచి తల్లితండ్రుల ఫోన్ నెంబర్ తెలుసుకుని వారికి సమాచారమిచ్చారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు తల్లిదండ్రులు. హోం వర్క్ చేయడంలేదని కుమారుడిని మందలించినట్టు తల్లి చెప్పింది. అంతమాత్రానికే బాలుడు ఇలా తీవ్ర నిర్ణయం తీసుకుంటాడని అనుకోలేదని తెలిపింది. దాంతో పోలీసులు తల్లిదండ్రులు, పిల్లవాడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే చిన్నమాటకే తన కొడుకు అనాథాశ్రమానికి వెళ్లాలని పట్టుపెట్టాడని తెలియడంతో ఒక్కసారిగా తల్లి ఉలిక్కిపడింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...