Alien spaceship: అది గ్రహాంతరవాసుల వాహనమా.? భయపెట్టిన ఎరుపు రంగు స్పేస్ షిప్.. వీడియో.
ఎరుపు రంగు వలయాకృతి ఇటలీలో తాజాగా కలకలం రేపింది. విస్తుగొలిపే ఈ వింత వలయం సెంట్రల్ ఇటలీలో ఆల్ఫ్స్ పర్వతాల నుంచి అడ్రియాటిక్ సముద్రం దాకా ఆకాశంలో ఏకంగా 360 కిలోమీటర్ల పొడవున విస్తరించి కనువిందు చేసింది.
ఎరుపు రంగు వలయాకృతి ఇటలీలో తాజాగా కలకలం రేపింది. విస్తుగొలిపే ఈ వింత వలయం సెంట్రల్ ఇటలీలో ఆల్ఫ్స్ పర్వతాల నుంచి అడ్రియాటిక్ సముద్రం దాకా ఆకాశంలో ఏకంగా 360 కిలోమీటర్ల పొడవున విస్తరించి కనువిందు చేసింది. అచ్చం హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యాన్ని తలపించిన ఈ వలయం గ్రహాంతరవాసుల అంతరిక్ష వాహనం అయ్యుండొచ్చని కొందరు భావించారు. సైంటిస్టులు మాత్రం అదేమీ కాదని స్పష్టం చేశారు. ఎల్వ్‌గా పిలిచే ఈ వలయాకారం తుపాను మేఘాలకు పై భాగాల్లో విడుదలయ్యే విద్యుదయస్కాంత శక్తి వల్ల పుట్టుకొస్తుంటాయట. ఈ ఎరుపు వలయం పుట్టుకకు సెంట్రల్ ఇటలీకి దాదాపు 285 కిలోమీటర్లు దక్షిణాన చెలరేగిన తుపాను సందర్భంగా చోటుచేసుకున్న శక్తిమంతమైన మెరుపు కారణమని వారు చెప్పారు. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ వాల్తెయిర్ బినొటో దీన్ని కెమెరాలో బంధించారు. ఆకాశంలో ఇలాంటి ఆకృతులను ఆయన తొలిసారిగా 2017లో ఫొటో తీశారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..