Crime: దారుణం.. అల్లుడిని చంపి.. సెప్టిక్‌ ట్యాంకులో పూడ్చారు..! షాకింగ్ వీడియో..

Crime: దారుణం.. అల్లుడిని చంపి.. సెప్టిక్‌ ట్యాంకులో పూడ్చారు..! షాకింగ్ వీడియో..

Anil kumar poka

|

Updated on: Aug 13, 2023 | 8:11 AM

నగామ జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా అల్లుడిని హతమార్చి సెప్టిక్‌ ట్యాంక్‌లో పూడ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడానికి చెందిన చింత అబ్బ సాయిలు తన రెండో కూతురు శైలజను 20 ఏళ్ల కిందట తన సోదరి కుమారుడైన ఏడునూతల గ్రామానికి చెందిన రామిండ్ల నాగరాజుకిచ్చి వివాహం చేసి ఇల్లరికం తెచ్చుకున్నాడు. వీరికి నలుగురు సంతానం కాగా నాగరాజు తరచూ మద్యం తాగి భార్యతో గొడవ పడటంతో..

జనగామ జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా అల్లుడిని హతమార్చి సెప్టిక్‌ ట్యాంక్‌లో పూడ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడానికి చెందిన చింత అబ్బ సాయిలు తన రెండో కూతురు శైలజను 20 ఏళ్ల కిందట తన సోదరి కుమారుడైన ఏడునూతల గ్రామానికి చెందిన రామిండ్ల నాగరాజుకిచ్చి వివాహం చేసి ఇల్లరికం తెచ్చుకున్నాడు. వీరికి నలుగురు సంతానం కాగా నాగరాజు తరచూ మద్యం తాగి భార్యతో గొడవ పడటంతో.. ఆమె పలుమార్లు దేవరుప్పుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాత్రి 10 గంటలకు నాగరాజు మద్యం తాగి ఇంటికి వచ్చి తలుపులను గట్టిగా కొట్టాడు. తలుపులు తీసిన భార్యతో గొడవపడ్డాడు. అతనికి నచ్చచెప్పి భార్య అన్నం తినిపించే ప్రయత్నం చేస్తుండగా ఆమె చేతి వేలును గట్టిగా కొరికాడు.

రక్తస్రావం కావడంతో.. తన తండ్రి అబ్బసాయిలును పిలవగా ఆయన కోపంతో అల్లుడైన నాగరాజును చెంపపై కొట్టాడు. ఆవేశంతో మామ మెడపై ఉన్న కండువాతో ఉరి బిగించాడు. అబ్బసాయిలు కూడా అల్లుడి మెడలోని కండువాతో అతనికి ఉరి బిగించడంతో నాగరాజు మృతిచెందాడు. భయాందోళనకు గురైన వారు అతడిని గుట్టు చప్పుడు కాకుండా సెప్టిక్‌ ట్యాంక్‌లో తలకిందులుగా వేసి పూడ్చి పెట్టారు. ఆగస్టు 8న యథావిధిగా కుటుంబ సభ్యులు ఎవరి పనులకు వారు వెళ్లిపోయారు. తర్వాతి రోజు ఉదయం జనగామలోని తన స్నేహితుడి ఇంటి నుంచి వచ్చిన మృతుడి పెద్ద కుమారుడు కిరణ్‌ ఇంట్లో పడివున్న తండ్రి దుస్తులను చూసి ఆరా తీయగా, అసలు విషయం బయటికి వచ్చింది. తండ్రిని పూడ్చిన పరిసరాల్లో ఉన్న మట్టిని గమనించి వెతికి చూడగా సెప్టిక్‌ ట్యాంకులో శవమై కనిపించాడు. పాలకుర్తి సీఐ విశ్వేశ్వర్‌కు సమాచారం అందించడంతో.. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సెప్టిక్‌ ట్యాంకు నుంచి బయటకుతీయగా మృతుడి తలపై బలమైన గాయమైనట్లు గుర్తించారు. మృతుడి మామ అబ్బసాయిలు, భార్య శైలజ, చిన్న కుమారుడు తేజ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...