3D printed food: అచ్చేసిన కేకులు – ప్రింటెడ్ చాకెట్లు- అంతా 3D మాయ.. మరి హెల్త్ ముఖ్యం కదా బిగిలు..!
మనిషి ఈజీగా తన అవసరాలను తీర్చుకునే క్రమంలో చాలా ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఆహారం తయారుచేసే కొరతకు చెక్ పెట్టేందుకు ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న పేరే 3డీ ప్రింటింగ్. ఈ న్యూ జనరేషన్‌కి కొత్త ఆవిష్కరణగా చెప్పవచ్చు. రకరకాల వంటలు చేస్తూ వారెవా అనిపించుకుంటోంది.
మనిషి ఈజీగా తన అవసరాలను తీర్చుకునే క్రమంలో చాలా ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఆహారం తయారుచేసే కొరతకు చెక్ పెట్టేందుకు ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న పేరే 3డీ ప్రింటింగ్. ఈ న్యూ జనరేషన్‌కి కొత్త ఆవిష్కరణగా చెప్పవచ్చు. రకరకాల వంటలు చేస్తూ వారెవా అనిపించుకుంటోంది. గతంలో అయితే వంటకాలు చేయాలంటే సాంప్రదాయ పద్ధతిలో నోరూరించేలా చేసేవాళ్లు. వాటిని ఫుడ్ బ్లాగ్స్‌లో పెడుతూ లక్షలు కోట్లలో సంపాదిస్తున్నారు. బహుశా ఇప్పుడు వారందరినీ రీప్లేస్ చేయడానికి మెషినరీ వచ్చేస్తోంది. ఈజీగా తక్కువ టైమలో రకరకాల వంటలు చేస్తూ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నాయి. 3డీ ప్రింటింగ్ మెషీన్ 2006లో లిప్సన్ కంపెనీ ఇన్‌వెంట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఫుడ్ మేకింగ్ రంగంలో దీని వాడకం పెరుగుతూ వస్తోంది. సిస్టమ్‌లో డిజైన్ చేసిన షేప్స్ ప్రకారం నిమిషాల్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ రుచి నాణ్యతలో ఎక్కడా రాజీపడటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్.. ఇప్పుడు మనం కేక్‌ను 3డి ప్రింట్ చేసి తినవచ్చు. నోట్లో ఇట్టే కరిగిపోయే చీజ్‌కేక్‌ను 3డీ ప్రింట్ చేశారు పరిశోధకులు. కొన్నిసార్లు ఫుడ్ టేస్ట్‌కి సీక్రెట్ 3D ప్రింటర్ కావచ్చు. 3డి ప్రింటెడ్ ఫుడ్ కొత్తేం కాదు. ఇప్పటికే కొన్ని ఐటమ్స్ కొన్ని రెస్టారెంట్లు తయారు చేస్తున్నాయి. 3డి ప్రింటడ్ ఫుడ్ అంటే ఏంటీ అంటే ఆహారాన్ని మెషీన్ తయారు చేయడం. ఉప్పు పప్పుల్ని సరైన మోతాదులో కలిపి మెషీనే ఆ ఐటెమ్‌ని వండి వార్చడం. కొలంబియా పరిశోధకులు తాజాగా మెకానికల్ అసెంబ్లింగ్‌లో ఒక అడుగు ముందుకేశారు. 3d చీజ్‌కేక్ తయారీలో పీనట్ బటర్, న్యుటెల్లా, స్ట్రాబెర్రీ జామ్ ఇంకా క్రీమ్ లాంటి 7 రకాల పదార్థాల్ని ఉపయోగించారు. వీటిని మెషీన్‌లో మిక్స్ చేసి ఫుడ్ గ్రేడ్ సిరంజిల ద్వారా చీజ్ కేక్‌ను లేయర్ బై లేయర్ సెట్ చేసి బేక్ చేశారు. ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్‌ని 3 printing ద్వారా సక్సెస్ చేశారు. అయితే ఇందులో కొత్తదనం ఏమిటంటే 7 పదార్థాల్ని మిక్స్ చేసి అసెంబ్లింగ్. చేయడం.
ఈ మధ్య కొత్తరకం మాంసం పుట్టుకొచ్చింది. దీన్ని ‘వెజ్ మీట్’ అని పిలుస్తున్నారు. ఇది అచ్చంగా చికెన్, మటన్ లాగానే ఉంటుంది. కానీ ఇది జంతువుల మాంసం కాదు, ప్లాంట్ బేస్డ్ మీట్. పోషకాల విషయంలో ఈ మాంసం ఎందులోనూ తక్కువకాదు. రెగ్యులర్ మాంసం కంటే ఇందులోనే ఎక్కువ పోషకాలుంటాయి. కావాలంటే తయారు చేసేటప్పుడే పోషకాల మోతాదు పెంచుకోవచ్చు కూడా. వ్యక్తుల ఆరోగ్యానికి, అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు. పైగా ఈ మాంసంలో ట్రాన్స్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ లాంటివి ఉండవు. ప్లాంట్ బేస్డ్ మీట్‌లో ఉండే ప్రొటీన్స్‌ను.. సోయా, బటానీ, మష్రూమ్, ఆలూ, బ్రౌన్ రైస్ నుంచి సేకరిస్తారు. కూరగాయలు, నట్స్‌లో ఉండే పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, డైటరీ ఫైబర్‌కు ఎలాంటి లోటూ ఉండదు. హెల్త్ పరంగా చూస్తే రెగ్యులర్ మాంసం కంటే ప్లాంట్ బేస్డ్ మీట్ కచ్చితంగా ఒక మెట్టు పైన ఉంటుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలున్నవారికి ఇదొక మంచి ఆల్టర్నేటివ్. సింథటిక్ ఎరువులు, రసాయనాల పురుగుమందుల వాడకాన్ని తగ్గించే అవకాశం ఉన్నా అయితే ఆక్స్‌ఫర్డ్ అధ్యయనం ప్రకారం, మాంసాన్ని కృత్రిమంగా తయారు చేయడం అంటే సంప్రదాయ వ్యవసాయం కంటే ఎక్కువ గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల చేయడమేనట.
ఇలా లాబ్ తయారీ మాంసం నుండి 3D ప్రింటింగ్ వరకు, టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకెళుతున్నాం. మన వంటిళ్లు విప్లవాత్మకంగా మారనున్నాయి. ఇప్పుడీ చీజ్‌కేక్‌తో భవిష్యత్తు తియ్యగా కనిపిస్తోంది. కానీ చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సాంకేతికత మనల్ని వంట బాదరబందీ నుంచి తప్పించగలదా? మరీ ముఖ్యంగా ప్రపంచంలో ఆకలి సమస్యను తీర్చగలదా?
3d printed food ప్రపంచ ఆకలిని తీరుస్తుందా? అంటే కొంత వరకు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచ ఆకలి తీర్చడానికి దేశాలు రాజకీయ పరంగా, సామాజిక పరంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
సంప్రదాయ వంట తయారీకి ఇది గొడ్డలిపెట్టుగా పరిణమిస్తుంది అని కొందరి వాదన. అలాగే ఫుడ్ సెక్యూరిటీ ఎంతవరకు ఇవ్వగలదు అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. అలాగే ఈ 3డీ ప్రింటింగ్ మెషీన్‌కి ఇప్పటివరకు ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేదు. యూరోప్ లాంటి కంట్రీస్‌లో 3డీ ఉపయోగిస్తున్నప్పటికీ సాఫ్ట్‌వేర్ అంతంత మాత్రమే. మెషీన్ కాబట్టి నాజిల్‌లో ఫుడ్ ఇరుక్కుపోయినా బాక్టీరియా ఏర్పడ్డం లాంటి లిమిటేషన్స్ లేకపోలేదు. అలా అని పూర్తిగా తీసిపారేయలేం. బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సరైన పోషకవిలువలు పాటిస్తూ ఆహారాన్ని క్షణంలో తయారుచేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేయగలదు. మన భారతదేశం లాంటి ఎక్కువ జనాభా ఉన్న దేశాలకి సరిగ్గా వాడుకుంటే ఫుడ్ సమస్య తీర్చగలదు.
అంతరిక్షయాత్రికులకు కూడా 3డీ ప్రింటింగ్ ఫుడ్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపుతోంది నాసా. ఈ మెషీన్ తయారుచేసిన బ్రెడ్, సలాడ్, పిజ్జా, మల్టి ఇన్‌గ్రిడియెన్స్ ఫుడ్, వి టమిన్ గమ్స్, కేక్ డెకరేటివ్స్ లాంటివి తయారుచేస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ కంబాట్ కూడా సైనికులకు పోషకాహారం అందించడానికి 3డీ ప్రింటింగ్ ఫుడ్‌ని ఎంకరేజ్ చేస్తోంది.
ఇక 3d printed food మార్కెట్ వినియోగం విషయానికొద్దాం. 3డి ప్రింటర్ చాలా ఖరీదైంది ధర 1,000 డాలర్లు. ప్రింటెడ్ ఆహారం మాకు రుచించదు అని కొంతమంది అంటుంటే షెఫ్ లెవరూ 3D ప్రింటర్‌తో వంటను అంగీకరించడం లేదు. 3d printed foodతో జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారట. అయితే 3d printed food రావడం అనివార్యమని నిపుణులు అంటున్నారు. సాంకేతికత మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత వెనక్కు వెళ్లే ప్రసక్తే ఉండదు. ఎవరికి తెలుసు, బహుశా మన వంటింట్లో డిజిటల్ షెఫ్ అడుగుపెట్టే రోజు అతి త్వరలో రావచ్చేమో.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..