Viral Video: జయహో చంద్రయాన్ -3.. ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించి సంబరాలు చేసుకున్న జనం..

Chandrayaan 3 Mission: ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ చంద్రయాన్-3ని సురక్షితంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆగస్టు చివరి వారంలో చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ అడుగుపెట్టనుంది.

Viral Video: జయహో చంద్రయాన్ -3.. ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించి సంబరాలు చేసుకున్న జనం..

|

Updated on: Jul 15, 2023 | 4:48 PM

ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగంతో భారత కీర్తిపతాక మరోసారి రెపరెపలాడుతోంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి శుక్రవారం రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్తుంటే.. దీన్ని ప్రత్యక్షంగా వీక్షించిన జనం సంబరాలు చేసుకున్నారు. దేశభక్తి నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సైన్స్‌ను ప్రజలు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం గ్రేట్ అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికల్లో తెర షేర్ చేస్తున్నారు.

ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ చంద్రయాన్-3ని సురక్షితంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆగస్టు చివరి వారంలో చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ అడుగుపెట్టనుంది.

Follow us
Latest News