Twitter Logo: ట్విట్టర్‌‌లో ‘పిట్ట’ మాయం.. కొత్త లోగో ఏంటో తెలుసా..? వీడియో..

Twitter Logo: ట్విట్టర్‌‌లో ‘పిట్ట’ మాయం.. కొత్త లోగో ఏంటో తెలుసా..? వీడియో..

Anil kumar poka

|

Updated on: Aug 01, 2023 | 1:40 PM

ట్విట్టర్‌ లోగో నుంచి పక్షి మాయమైపోతుందని ఆ సంస్థ యజమాని ఎలాన్‌ మస్క్‌ చెప్పారు. చాలా ఏళ్లుగా ట్విట్టర్‌‌కు ప్రధాన చిహ్నంగా ఉన్న ‘పిట్ట’ లోగో మార్పు విషయాన్ని ఆయన జూలై 23న వెల్లడించారు. త్వరలోనే తాము ట్విట్టర్‌ బ్రాండ్‌కు, ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నామని పేర్కొన్నారు. రాత్రి పోస్టు చేసిన X లోగో బాగుంటే ప్రపంచ వ్యాప్తంగా లైవ్‌లోకి వస్తుంది అంటూ మస్క్ వరుస ట్వీట్లు చేశారు.

ట్విట్టర్‌ లోగో నుంచి పక్షి మాయమైపోతుందని ఆ సంస్థ యజమాని ఎలాన్‌ మస్క్‌ చెప్పారు. చాలా ఏళ్లుగా ట్విట్టర్‌‌కు ప్రధాన చిహ్నంగా ఉన్న ‘పిట్ట’ లోగో మార్పు విషయాన్ని ఆయన జూలై 23న వెల్లడించారు. త్వరలోనే తాము ట్విట్టర్‌ బ్రాండ్‌కు, ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నామని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లైవ్‌లోకి వస్తుంది అంటూ మస్క్ వరుస ట్వీట్లు చేశారు. ప్లాట్‌ఫామ్‌ కలర్‌‌ను డీఫాల్ట్‌గా బ్లాక్‌గా మారుస్తామని పేర్కొన్నారు. మరోవైపు ట్విట్టర్‌లోని అన్‌ వెరిఫైడ్‌ ఖాతాల నుంచి డైరెక్ట్ మెసేజ్‌లు ఉంచడాన్ని పరిమితం చేస్తున్నట్లు జూలై 22న మస్క్‌ ప్రకటించారు. డైరెక్ట్‌ మెసేజ్‌ల స్పామ్‌ను తగ్గించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అన్‌వెరిఫైడ్‌ ఖాతాల నుంచి భవిష్యత్తులో పరిమిత సంఖ్యలోనే డైరెక్ట్‌ మెసేజ్‌ లు చేయగలరని, అందుకు ఈరోజే సబ్ స్క్రైబ్‌ చేసుకొని ఎక్కువ మెసేజ్‌లు పంపండి అంటూ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...