Formula-E race: ఫార్ములా రేస్ వద్ద సెలబ్రిటీల సందడి.. సచిన్ నుండి చెర్రీ వరకు బడా స్టార్స్.. (లైవ్)

Formula-E race: ఫార్ములా రేస్ వద్ద సెలబ్రిటీల సందడి.. సచిన్ నుండి చెర్రీ వరకు బడా స్టార్స్.. (లైవ్)

Anil kumar poka

|

Updated on: Feb 11, 2023 | 4:05 PM

హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ నడిబొడ్డున ఫార్ములా ఈ- కార్ రేసింగ్ జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ రేసింగ్‌ పోటీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ నడిబొడ్డున ఫార్ములా ఈ- కార్ రేసింగ్ జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ రేసింగ్‌ పోటీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కాగా ప్రధాన రేస్‌ శనివారం, ఆదివారాల్లో (ఫిబ్రవరి 11, 12) జరగనుండగా, శుక్రవారం (ఫిబ్రవరి 10)న ప్రీ ప్రాక్టీస్‌ రేస్‌ను నిర్వహించారు. మొత్తం 11 జట్ల నుంచి 22 మంది డ్రైవర్లు ఈ ప్రీ రేస్ లో పాల్గొన్నారు. ఈ ఫార్ములా రేసింగ్‌ ప్రమోషన్స్ కోసం సినీతారలు సైతం దిగి వచ్చి అభిమానుల్లో జోష్‌ నింపుతున్నారు. ఈ క్రమంలో సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఫార్ములా-ఇ రేసింగ్‌ను సందర్శించారు. మహేష్ బాబు సతీమణి నమ్రత, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. కాగా నారావారి కోడలు బ్రాహ్మణి, నందమూరి కోడలు లక్ష్మీ ప్రణతి ఒకేచోట కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరూ దగ్గరి బంధులువైనా కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది ఇద్దరూ ఒకేచోట కనువిందు చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 11, 2023 01:24 PM