Hardik Pandya: మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్య.. కారణం ఏంటంటే..! వీడియో..
టీమ్‌ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే, పాండ్య రెండో పెళ్లి చేసుకోవడం లేదు. తన సతీమణి, సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ను మరోసారి వివాహం చేసుకోబోతున్నాడు.
టీమ్‌ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే, పాండ్య రెండో పెళ్లి చేసుకోవడం లేదు. తన సతీమణి, సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ను మరోసారి వివాహం చేసుకోబోతున్నాడు. వీరిద్దరికి ఇదివరకే పెళ్లయి ఓ కుమారుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే. 2020 లాక్‌డౌన్‌లో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. దీంతో ఆత్మీయులు, బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయబద్దంగా మరోసారి వివాహం చేసుకోవాలని పాండ్య ఎప్పట్నుంచో భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఈ ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన హార్దిక్ – నటాషా జోడీ ఘనంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 16 వరకు నాలుగు రోజల్లో హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ విషయంపై హార్దిక్ –నటాషా ఇంకా స్పందించలేదు.2019 డిసెంబర్ 31న దుబాయ్‌లో పాండ్య.. నటాషా చేతికి ఉంగరం తొడిగి వినూత్నంగా తన ప్రేమను వ్యక్తపరిచి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఆమె కూడా పాండ్య ప్రేమను అంగీకరించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2020లో లాక్‌డౌన్‌లో తన భార్య గర్భవతి అని సోషల్ మీడియాలో పెట్టినప్పుడే అతడికి పెళ్లైందని తెలిసింది. అదే ఏడాది జులైలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది నటాషా. బాబుకి అగస్త్య పాండ్యా అని పేరు పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..