Watch Video: వచ్చే ఎన్నికల్లో పోటీపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. !

Watch Video: వచ్చే ఎన్నికల్లో పోటీపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. !

Janardhan Veluru

|

Updated on: Aug 15, 2023 | 7:20 PM

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ఎలాంటి మార్పు ఉండదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టంచేశారు. అలాగే ఒంగోలు ఎంపీ సీటుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని స్పష్టంచేశారు. ఈ విషయంలో పలు రకాలుగా ప్రచారం జరుగుతోందని, దీన్ని ఎవరూ నమ్మొద్దని పార్టీ శ్రేణులను ఆయన కోరారు.

AP Politics: వచ్చే ఎన్నికల్లో పోటీపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించుకున్నారు. తాను పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు. అలాగే ఒంగోలు ఎంపీ సీటుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని స్పష్టంచేశారు. ఈ విషయంలో పలు రకాలుగా ప్రచారం జరుగుతోందని, దీన్ని ఎవరూ నమ్మొద్దని పార్టీ శ్రేణులను ఆయన కోరారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తాను స్లోగా ఉన్నట్లు సీఎం జగన్ చెప్పారని వెల్లడించిన బాలినేని.. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకునే క్రమంలో ఆలస్యం జరుగుతున్నట్లు సీఎంకు వివరించినట్లు తెలిపారు. అయితే ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తప్పక తెలుసుకుంటానని చెప్పారు.