Big News Big Debate: వర్మ ‘వ్యూహం’ వెనుక ఉన్నదెవరు..? ఈ చిత్రం వెనక రాజకీయ లక్ష్యం ఉందా?
మంచివాడా.. చెడ్డవాడా... కొందరికి జ్ణాని.. మరికొందరికి మహామూర్ఖుడు. ఎవరికి ఎలా కావాలంటే అలా కనిపిస్తాడు. అంతా నాఇష్టం అంటూ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తారు. బహిరంగంగా అమ్మాయిల కాళ్లకు ముద్దు పెడతారు. అంతగా ఇష్టం లేని సబ్జెక్టు అంటూనే రాజకీయ పార్టీల చుట్టూ సినిమాలు తీస్తారు. నాయకులపై ఇష్టారీతిగా పోస్టులు కూడా పెడుతుంటారు. కులాల పట్టింపు తనకు లేదంటారు కానీ.. రాజకీయ పార్టీల మధ్య కులాల కుంపట్ల రాజుకునేలా కామెంట్లు చేస్తారు. ఆయనే వన్ అండ్ ఓన్లీ రాంగోపాల్ వర్మ.
వర్మ అంటే వివాదం.. ఇంకొందరికి వినోదం.. ఆయన అధ్బుతం అనేవాళ్లున్నారు.. టైమ్ వేస్ట్ అనుకునేవాళ్లున్నారు. ఇందులో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఎవరేమనుకున్నా ఆయనకు అనవసరం. తను నమ్మిందే చేస్తారు.. నచ్చినట్టు ఉంటారు. అలాంటి ఆర్జీవీ మరోసారి వార్తల్లో నిలిచారు.. దీనికి కారణం వ్యూహం సినిమా.. ఇప్పటిదాకా వచ్చిన రెండు టీజర్లలో పాత్రలు ఏంటో చెప్పారు.. సినిమా ఎలా ఉంటుందో జనాలకు క్లారిటీ ఇచ్చారు. జగన్ అంటే ఇష్టం అంటున్న వర్మ వ్యూహం సినిమా వెనక వ్యూహం ఉందా. ఎన్నికలను ప్రభావితం చేయడం ఆయన లక్ష్యమా? ఈ లక్ష్యం వెనక రాజకీయ లక్ష్యం ఉందా?
Published on: Aug 16, 2023 07:02 PM
వైరల్ వీడియోలు
Latest Videos