Minister KTR: మీ దయతోనే నాలుగుసార్లు గెలిచా.. వేరేటోళ్ల చేతిలో పెట్టి ఆగం కావొద్దు: మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ మరోసారి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మీ దయతోనే నాలుగుసార్లు గెలిచానని.. మరోసారి గెలిపిస్తే మరిన్ని మంచి పనులు చేస్తా అనడం రాజకీయవర్గాల్లో చర్చగా మారింది.
సిరిసిల్ల, ఆగస్టు 15: మంత్రి కేటీఆర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ మరోసారి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మీ దయతోనే నాలుగుసార్లు గెలిచానని.. మరోసారి గెలిపిస్తే మరిన్ని మంచి పనులు చేస్తా అనడం రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అభివృద్ధి జరుగుతున్న సమయంలో తప్పు చేయోద్దన్నారు. తెలంగాణను వేరేటోళ్ల చేతిలో పెట్టి ఆగం కావొద్దంటూ వచ్చే ఎన్నికలను ఉద్దేశించి కామెంట్ చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందన్నారు. ఇక్కడ రైతు బంధు ప్రవేశపెడితే.. కేంద్రం పీఎం కిసాన్ అమలు చేస్తోందన్నారు. ఇక్కడ మిషన్ భగీరథ తీసుకొస్తే.. కేంద్రం హర్ ఘర్ జల్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు.
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా అన్ని వర్గాల ప్రజలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా రాజన్న… pic.twitter.com/TT9a0DrBHI
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 15, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..