Jagga Reddy Live: తెలంగాణ కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి సంచలన ప్రెస్ మీట్ (లైవ్)..
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారతారనే ప్రచారం కాంగ్రెస్ కంటే BRS శ్రేణులను ఎక్కువ కలవరపరుస్తోంది. కాంగ్రెస్‌ను వీడి జగ్గారెడ్డి BRSలో చేరుతారనే మాటలు గత కొద్ది రోజులుగా గట్టిగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల సమయంలో మంత్రి KTRను జగ్గారెడ్డి ప్రత్యేకంగా కలవడంతో ఈ మాటలకు మరింత బలం చేకూరుతోంది.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారతారనే ప్రచారం కాంగ్రెస్ కంటే BRS శ్రేణులను ఎక్కువ కలవరపరుస్తోంది. కాంగ్రెస్‌ను వీడి జగ్గారెడ్డి BRSలో చేరుతారనే మాటలు గత కొద్ది రోజులుగా గట్టిగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల సమయంలో మంత్రి KTRను జగ్గారెడ్డి ప్రత్యేకంగా కలవడంతో ఈ మాటలకు మరింత బలం చేకూరుతోంది. TPCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఉన్న విభేధాల కారణంగా గత కొన్నాళ్లుగా జగ్గారెడ్డి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య ఢిల్లీ వెళ్లి రాహుల్‌ను కలిసి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు కూడా చేశారు. జగ్గారెడ్డి BRSలో చేరతారనే మాటలు గట్టిగా వినిపిస్తుండటంతో సంగారెడ్డి BRS నేతలు అప్రమత్తమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగ్గారెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని చెప్తూ మంత్రి హరీష్‌రావును కలిశారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన దాదాపు 200 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి హరీష్ రావును కలిశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...