Dance Video: ‘డేంజరస్’ మ్యూజిక్‌కి కొత్త స్టెప్పులు..! ‘మైఖేల్ జాక్సన్ దొరికేశాడు’ అంటున్న నెటిజన్లు..

డేంజరస్ మ్యూజిక్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి వేసే స్టెప్పులకు ఎవరికైనా మతి పోతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో..

Dance Video: ‘డేంజరస్’ మ్యూజిక్‌కి కొత్త స్టెప్పులు..! ‘మైఖేల్ జాక్సన్ దొరికేశాడు’ అంటున్న నెటిజన్లు..
Dancing Visuals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 01, 2023 | 12:06 PM

మైఖేల్ జాక్సన్ పేరు వినగానే గుర్తు వచ్చే డ్యాన్స్ వీడియోలలో ‘డేంజరస్’ కూడా ఒకటి. దానికి సంబంధించిన వీడియోను మీరు ఒక సారి అయినా చూసే ఉంటారు. ఆ మ్యూజిక్‌కి ఇప్పటివరకు ఎందరో డ్యాన్సర్లు స్టెప్పులేశారు. మనలో కూడా చాలా మంది సరదాగా దానితో పాటు కాలు కదిపిన సందర్భాలు ఉంటాయి. అయితే ఇప్పుడు డేంజరస్ మ్యూజిక్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి వేసే స్టెప్పులకు ఎవరికైనా మతి పోతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్నది డేంజరస్ మ్యూజిక్ అయినప్పటికి అతను ఏ ట్యూన్‌కి స్టెప్పులేస్తున్నాడో తెలియడం లేద ని నెటిజన్లు అంటున్నారు.

dumbest_man1811 అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన వీడియోలో డ్యాన్స్ చేసే వ్యక్తి ముందుకు పడతాడు. ఆ తర్వాత ఒక్క సారిగా గాల్లోకి ఎగిరి స్టెప్పులేస్తాడు. ఈ క్రమంలో అతను ఏదో తాడును పట్టుకుని లాగుతున్నట్లుగా, మధ్యలో అలసిపోయినట్లుగా కూడా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడు. ఇక దీనికి సంబంధించిన దృశ్యాలను మీరు కూడా ఈ వైలర్ వీడియోలో చూడవచ్చు. నెట్టింట హల్‌చల్ అవుతున్నఈ డ్యాన్స్ వీడియోను మీరు ఇక్కడ చూడండి.. 

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Dumb? (@dumbest_man1811)

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. రకరకాల కామెంట్లతో వీడియోపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘మైఖేల్ జాక్సన్ లైట్’ అని రాసుకొచ్చాడు. అలాగే మరో నెటిజన్ ‘మైఖేల్ జాక్సన్ దొరికేశాడు’ అని కామెంట్ చేయగా, ఇంకొకరు ‘సూపర్ స్టెప్స్’ అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..