సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. తాజాగా అలాంటి అద్భుతమైన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అడవిలో హైనాలు చాలా ప్రమాదకరం. అవి సింహాలను భయపెట్టిస్తాయి. అలాంటి హైనాలు మనుషులను చూస్తే ఊరుకుంటాయా? పోనీ మనుషులు వాటి దగ్గరకు వెళ్లే ధైర్యమైనా చేస్తారా? అసలు ఆ ఆలోచనే చాలా భయంకరంగా ఉంటుంది. కానీ, ఓ స్త్రీ మాత్రం ఏమాత్రం భయం, బెరుకు లేకుండా ఒకటి కాదు రెండు కాదు.. వందలాది హైనాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ నెత్తిలో నీటి కుండ, చేతిలో ఒక క్యాన్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తోంది. అయితే, ఆమె వెళ్లే మార్గం అటవీ ప్రాంతం. అక్కడన్నీ కృూర మృగాలు సంచరిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆమె వెళ్తుండగా.. దారిపోడవునా అత్యంత భయానకమైన, ప్రాణాంతకమైన హైనాలు నిలబడి ఉన్నాయి. అయితే, వందలాది హైనాలు నిలబడి ఉన్నా.. ఆ మహిళ ఏమాత్రం భయపకుండా ధైర్యంగా ముందుకెళ్లింది. ఆమె అలా వెళ్తుంటే హైనాలు చూస్తూ నిల్చున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. అచ్చంగా ఆదిపరాశక్తి నడుచుకుంటూ వెళ్తున్నట్లే ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Couldn’t be me pic.twitter.com/9yt3yBFIpz
— OnlyBangers (@OnlyBangersEth) March 27, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి..