Viral Video: ఆన్సర్ షీట్‌లో ప్రశ్నకు సమాధానంగా సినిమా సాంగ్స్ రాసిన స్టూడెంట్.. గురువుగారి రియాక్షన్ ఏమిటంటే..?

కొంతమంది అతితెలివి స్టూడెంట్స్.. ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోతే.. తమకు తోచింది రాస్తారు. అయితే ప్రస్తుతం ఇక స్టూడెంట్ పరీక్షా పత్రం వైరల్ అవుతుంది. ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే.. ప్రశ్నలకు జవాబులుగా సినిమా పాటలతో పాటు.. తమ పేపర్ ను దిద్దే టీచర్ ని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నాడు ఓ స్టూడెంట్...

Viral Video: ఆన్సర్ షీట్‌లో ప్రశ్నకు సమాధానంగా సినిమా సాంగ్స్ రాసిన స్టూడెంట్.. గురువుగారి రియాక్షన్ ఏమిటంటే..?
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Apr 01, 2023 | 9:48 AM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పరీక్షల సీజన్ మొదలైంది. అనేక ప్రాంతాల్లో విద్యార్థుల తెలివికి హార్ట్ వర్క్ కు పరీక్ష పెట్టె పరీక్షలు మొదలయ్యాయి. తాము రాస్తున్న పరీక్షా పాత్రల్లోని అన్ని ప్రశ్నలకు జవాబులు రాసి.. మంచి మార్కులు సంపాదించుకోవాలని కొంతమంది స్టూడెంట్స్ భావిస్తారు. అదే సమయంలో కొంతమంది అతితెలివి స్టూడెంట్స్.. ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోతే.. తమకు తోచింది రాస్తారు. అయితే ప్రస్తుతం ఇక స్టూడెంట్ పరీక్షా పత్రం వైరల్ అవుతుంది. ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే.. ప్రశ్నలకు జవాబులుగా సినిమా పాటలతో పాటు.. తమ పేపర్ ను దిద్దే టీచర్ ని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నాడు ఓ స్టూడెంట్…

చండీగఢ్ యూనివర్శిటీకి చెందిన ఒక విద్యార్థి .. పరీక్ష ఆన్సర్ షీట్ కి సంబంధించిన వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.  పరీక్షల్లో సబ్జెక్ట్ కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానంగా విద్యార్థి రాసిన హాస్య సమాధానాల కారణంగా వైరల్ అయ్యింది. స్టూడెంట్ కేవలం మూడు ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే రాశాడు.. వాటిలో రెండు ప్రశ్నలకు గాను రెండు హిందీ సినిమా పాటలు రాశాడు. మొదటి ప్రశ్నకు సమాధానంగా అమీర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా త్రీ  ఇడియట్స్ చిత్రం నుండి “గివ్ మీ సమ్ సన్‌షైన్, గివ్ మి సమ్ రెయిన్; గివ్ మి అదర్ ఛాన్స్; ఐ వాన్నా గ్రో అప్ వన్స్ ఎగైన్” అనే పాటను రాయగా

ఇవి కూడా చదవండి

మూడో ప్రశ్నకు సమాధానం గా పీకే మూవీ నుంచి “భగవాన్ హై కహాన్ రే తూ” పాటను రాశాడు. ఇక రెండవ ప్రశ్నకు సమాధానంగా విద్యార్థి తన క్లాస్ టీచర్ కు ఓ సందేశాన్ని రాశాడు.. “మేడమ్, మీరు తెలివైన ఉపాధ్యాయులు, నేను కష్టపడి పని చేయలేకపోవడమే నా తప్పు, .. దేవుడా నాకు కొంత ప్రతిభను ఇవ్వు అంటూ ప్లీజ్ చేసే ప్రయత్నం చేశాడు.

ఫన్నీ ఆన్సర్ తో ఉన్న ఈ జవాబు పత్రం అందరినీ నవ్వించేలా చేస్తుంది. అయితే ఆ స్టూడెంట్ కు టీచర్ జోరో మార్కులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..