Wedding Video: పెళ్లి వేడుకలో వరుడు చేసిన పనికి అందరూ షాక్‌.. వధువు వాకౌట్‌!

పెళ్లి వేడుక ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైనదే. ఎందుకంటే జీవితంలో ఒకేఒకసారి జరిగే అందమైన ముచ్చట. వధువరులు జీవితాంతం ఒకరికొకరు పాలునీళ్లలా కలిసి ఉంటామని అతిథుల సాక్షిగా ప్రమాణాలు చేసుకుంటారు. ఏ దేశ సంస్కృతిలోనైనా దాదాపు ప్రతి వివాహ వేడుక ఇలాగే..

Wedding Video: పెళ్లి వేడుకలో వరుడు చేసిన పనికి అందరూ షాక్‌.. వధువు వాకౌట్‌!
Groom Slaps Bride
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 14, 2023 | 12:30 PM

పెళ్లి వేడుక ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైనదే. ఎందుకంటే జీవితంలో ఒకేఒకసారి జరిగే అందమైన ముచ్చట. వధువరులు జీవితాంతం ఒకరికొకరు పాలునీళ్లలా కలిసి ఉంటామని అతిథుల సాక్షిగా ప్రమాణాలు చేసుకుంటారు. ఏ దేశ సంస్కృతిలోనైనా దాదాపు ప్రతి వివాహ వేడుక ఇలాగే ఉంటుంది. ఐతే కొందరు తమ వివాహ వేడుక భిన్నంగా ప్లాన్‌ చేస్తారు. ఇలాంటి ప్రయత్నం చేసిన ఓ జంట అనుకోకుండా వార్తల్లో నిలిచింది. వరుడు ఆవేశంలో చేసిన పనికి అతిథులంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఉజ్బెకిస్తాన్‌కు చెందిన పెళ్లి రిసెప్షన్‌లో వధూవరుల మధ్య సరదాగా ఈ గేమ్ నిర్వహించారు. వదువరులిద్దరూ గేమ్‌ ఆసక్తిగా ఆడారు. ఇంతలో వథువు త్వరగా టాస్క్‌ కంప్లీట్‌ చేసింది. వరుడు గెలవకపోయే సరికి పట్టరాని ఆవేశానికి గురయ్యాడు. అందరూ చూస్తుండగానే స్టేజ్‌పైనే భార్య తలపై లాగి ఒక్కటిచ్చాడు. దీంతో అందరి ముందు ఆమెపై చేయి చేసుకోవడంతో ఆవేదనకు గురైన వధువు కన్నీళ్లు పెట్టుకుంటుంది. పైగా అక్కడున్నవారు ఎవ్వరూ అతన్ని ఏమీ అనకపోవడం వీడియోలో చూడొచ్చు. ఇంతలో పక్కనే ఉన్న ఇద్దరు మహిళలు వధువును స్టేజ్‌ మీది నుంచి తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తుంది.30 నిముషాల వ్యవధి కలిగిన ఈ వీడియోలో క్లిప్‌ పాతదైనప్పటికీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. వరుడిపై కేసు పెట్టాలంటూ నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.