Watch Video: పెళ్లి జంట ఫోటోషూట్.. ఇంతలో కోతి చేసిన పనికి బిత్తరపోయిన నవవధువు.. వైరల్ అవుతున్న వీడియో..

Animal Viral Video: కోతి చేష్టలు అనే మాటను సార్థకం చేసుకునేలా కోతులు చేసే అల్లరి పనులకు సంబంధించిన వీడియోలను మనం అనునిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు కూడా అలాంటి వీడియో..

Watch Video: పెళ్లి జంట ఫోటోషూట్.. ఇంతలో కోతి చేసిన పనికి బిత్తరపోయిన నవవధువు.. వైరల్ అవుతున్న వీడియో..
Newlyweds Being Interrupted By A Monkey With A Baby
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 26, 2022 | 4:39 PM

Viral Video: సాధారణంగానే కోతులు చాలా చురుకుగా ఉంటాయి. అందునా వాటికి నచ్చినవాటిని లాక్కోవాలన్నా, చేయాలన్నా మరింత చురుకుగా గంతులేస్తాయి. కోతి చేష్టలు అనే మాటను సార్థకం చేసుకునేలా కోతులు చేసే అల్లరి పనులకు సంబంధించిన వీడియోలను మనం అనునిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో తన బిడ్డతో ఉన్న ఒక మెక్సికన్ స్పైడర్ కోతి వచ్చి నూతన దంపతుల వెడ్డింగ్ షూట్‌కు అంతరాయం కలిగిస్తుంది. అప్పటికే డ్యాన్స్ చేస్తూ ఉన్న ఈ జంట వద్దకు కోతి రావడాన్ని ఒక్కసారిగా చూసిన వధువు కొంచెం పక్కకు వెళ్తుంది.

ఇక అక్కడే ఉన్న వరుడి చేతిని పట్టుకుని అతని భుజం మీదకు వెళ్తుంది. అలా కొంత సేపు అతని భుజంపైనే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘ఫైర్ అండ్ ఐస్’ అనే ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవుకుంటున్నారు. ఇక నెటిజన్లు అయితే వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఆ క్రమంలోనే ఒక నెటిజన్ ‘ ఆ కోతి కూడా డ్యాన్స్ వేయాలనుకుంటుంది’ అని కామెంట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

View this post on Instagram

A post shared by FIRE & ICE (@fireandice)

మరో నెటిజన్ ‘నన్ను కూడా పట్టుకో..’ అంటూ ఈ కోతి వచ్చిందని రాసుకొచ్చాడు. కాగా పోస్ట్ చేసినప్పటి నుంచి ఈ వీడయోను దాదాపు 2000 మంది లైక్ చేశారు. అలాగే అనేక మంది నెటిజన్లు కామెంట్లు చేస్తూనే  ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి