పొట్టిగా ఉన్నానని.. 6 అడుగుల ఎత్తుకోసం రూ. 66లక్షలు వెచ్చించిన యువకుడు..

అతని ఎత్తు కారణంగా ఏ అమ్మాయి తనను ఇష్టపడేది కాదని అతడు వాపోయాడు. చాలా మంది అమ్మాయిలు అతన్ని తిరస్కరించారు. తన ప్రేమను ఏ అమ్మాయి అర్థం చేసుకోలేదని, దాంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా చెప్పాడు. అందుకే ఎలాగైనా ఎత్తు పెరగాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత కాలికి సర్జరీ చేయించుకుని ఎత్తు పెంచుకున్నాడు.

పొట్టిగా ఉన్నానని.. 6 అడుగుల ఎత్తుకోసం రూ. 66లక్షలు వెచ్చించిన యువకుడు..
Leg Lengthening Surgery
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2023 | 6:11 PM

అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. దీనికోసం కొందరు మేకప్ చేసుకుంటే మరికొందరు లక్షల రూపాయలు వెచ్చించి సర్జరీ చేయించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవడం చూస్తుంటాం. ఇకపోతే, ఎత్తు తక్కువగా ఉండటం వల్ల జీవితంలో నిరంతరం తిరస్కారాలను ఎదుర్కొనే వ్యక్తులు తరచూ డిప్రెషన్‌తో పాటు ఇతర మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి పరిస్థితులు వారిని స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి వేరు చేస్తాయి. వారి జీవితాలను దుర్భరపరుస్తాయి. అయితే 27 ఏళ్ల యువకుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే పని చేశాడు. అతడు తన ఎత్తు పెంచుకునేందుకు రూ.66 లక్షలు ఖర్చు చేశాడు. జార్జియాకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి తన ఎత్తును 5’5 నుండి 6’కి పెంచి అవయవాలను పొడిగించే శస్త్రచికిత్స కోసం $81,000 (రూ. 66,44,106) వెచ్చించాడు.

5 అడుగుల 5 అంగుళాల పొడవు ఉన్న వ్యక్తి శస్త్రచికిత్స తర్వాత 6 అడుగుల పొడవు పెరిగాడు. అతని ఎత్తు కారణంగా ఏ అమ్మాయి తనను ఇష్టపడేది కాదని అతడు వాపోయాడు. చాలా మంది అమ్మాయిలు అతన్ని తిరస్కరించారు. తన ప్రేమను ఏ అమ్మాయి అర్థం చేసుకోలేదని, దాంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా చెప్పాడు. అందుకే ఎలాగైనా ఎత్తు పెరగాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత కాలికి సర్జరీ చేయించుకుని ఎత్తు పెంచుకున్నాడు. గతంలో 5 అడుగుల 5 అంగుళాల పొడవు ఉన్న అతడు శస్త్రచికిత్స తర్వాత ఇప్పుడు 6 అడుగుల ఎత్తుకు పెరిగాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by @mrbrokenbonez

సర్జరి అనంతరం అతడు మాట్లాడుతూ..తన కంటే పొడవుగా ఉన్న అమ్మాయిలు తనను తిరస్కరించారని చెప్పాడు. పొట్టిగా ఉండటం వల్ల ఓవరాల్‌గా ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడ్డానని చెప్పాడు. ఎలాగైనా ఎత్తు పెంచుకోవాలని నిర్ణియించుకున్నట్టుగా చెప్పాడు. అవయవాలను పొడిగించే శస్త్రచికిత్స తనకు ఒక వరంలా దొరికిందని చెప్పాడు. ఇదిలా ఉంటే, గతంలో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తన ఎత్తును ఏడు అంగుళాలు పెంచుకునేందుకు రూ.88 లక్షలు చెల్లించాడు.

మరిన్ని ట్రెండింగ్  న్యూస్ కోసం క్లిక్ చేయండి..