చీ..చీ.. ఇదేం పని సామి..! ఏ మాత్రం శుఛీ శుభ్రత లేని పానీపూరి వ్యాపారం.. వైరలవుతున్న వీడియో..

అయితే, పానీపూరీ విక్రేతలు.. కస్టమర్లకు సప్లై చేసే క్రమంలో వారు ఒక రకమైన డ్యాన్స్‌ చేస్తుంటారు.. ఇది ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి కారణం. ఇక్కడ కూడా ఇతడు అలాగే చేశాడు. కానీ, మధ్య మధ్యలో అతడు చేస్తున్న పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. అదేంటో వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. 

చీ..చీ.. ఇదేం పని సామి..! ఏ మాత్రం శుఛీ శుభ్రత లేని పానీపూరి వ్యాపారం.. వైరలవుతున్న వీడియో..
Panipuri Video
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2023 | 4:03 PM

క్రిస్పీ పూరీతో పాటు తీపి, పులుపుతో లభించే రుచికరమైన పానీతో ఆస్వాదించే పానీ అంటే చాలా మందికి ఎంతగానో ఇష్టం.. అత్యంత ఎక్కువ మందికి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇది. ఈ రుచికరమైన వంటకం చాలా ప్రజాదరణ పొందింది. ప్రతి వీధిలో ఒకటి నుండి రెండు పానీపూరీ దుకాణాలు ఉంటాయి. ఇది దేశంలోని ప్రతి సందు, వాడలోనూ కనిపిస్తుంది. ఈ రుచికరమైన ఇవీనింగ్‌ స్నాక్‌ ఐటమ్‌ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడతారు. నోరు పెద్దగా తెరిచి గొలగప్ప తింటారు. ఇక మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు వీధి వ్యాపారులు అనేక వ్యూహాలను అనుసరిస్తారు. గోల్‌గప్పాలను రకరకాల వెరైటీల్లో వడ్డిస్తారు. అయితే, పానీపూరి ప్రియులు తప్పక చూడాల్సిన వీడియో ఇది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందినదిగా తెలిసింది. జైపూర్‌లో రోడ్డు పక్కన బండిపై గొలగప్పను విక్రయిస్తున్న ఓ దుకాణదారుడు నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు. ఈ వ్యక్తి ఎక్కువ రద్దీగా ఉండే ట్రిపోలియా మార్కెట్‌లో గొలగప్పలను విక్రయిస్తున్నాడు. అయితే అతను కేవలం టేస్ట్‌తోనే కాకుండా కాస్త వెరైటీని తన వ్యాపారంలో జోడించాడు. తన వద్దకు వచ్చే కస్టమర్లకు.. డ్యాన్స్ చేస్తూ పానీపూరిని అందిస్తూ మరింత మంది కస్టమర్‌లను ఆకర్షించేందుకు వెరైటీగా ట్రై చేస్తున్నాడు. ఇదంతా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కానీ, నెటిజన్లతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న వీడియోలో పానీపూరి విక్రేత తన ఒట్టి చేతులతో పానీ పూరీ మసాలా కలపడం, పూరీలను నింపడంతో పాటు.. చిత్రమైన డ్యాన్స్ చేస్తూ కస్టమర్లకు అందిస్తుంటాడు. మధ్య మధ్యలో అతను తన ముక్కును గీసుకుంటున్నాడు..ఆ తర్వాత అలాగే.. పానీ పూరి నీటిలో తన చేతులను ముంచుతున్నాడు.. ఆ తర్వాత అదే చేతితో కస్టమర్లకు గోల్‌గప్ప అందించే ముందు తన చేతితో రుచి చూస్తాడు. ఇదంతా చూస్తుంటే వాక్‌ అనిపిస్తుంది.. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ వ్యాపారి వద్ద విశిష్టమైన వడ్డించే విధానం ఉన్నప్పటికీ అతడు చేసే పనిని విమర్శిస్తున్నారు. అతడు రుచితో పాటు శుచితో కూడిన ఆహారాన్ని ఇవ్వడం మరిచిపోయాడంటూ మండిపడుతున్నారు.

ఇలాంటి అనారోగ్యకరమైన గోలగప్పాలకు దూరంగా ఉండాలని నెటిజన్లు ప్రజలకు చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఆహారాల కారణంగా డయేరియా వంటి నీటి ద్వారా వచ్చే వ్యాధులు, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్  న్యూస్ కోసం క్లిక్ చేయండి..