MLA Rathod Bapurao Car Accident : పెను ప్రమాదం.. నుజ్జనుజ్జయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వాహనం

ఎమ్మెల్యే వాహనం డ్రైవర్ కు గాయాలయ్యాయి. కార్‌లోని ఎమర్జెన్సీ బెలున్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఎమ్మెల్యే బాపురావు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. గాయాలైన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ను స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు వాహనంలో నేరడిగొండ టోల్ ప్లాజా వరకు తరలించగా..

MLA Rathod Bapurao Car Accident : పెను ప్రమాదం.. నుజ్జనుజ్జయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వాహనం
Mla Rathod Bapurao Car Acci
Follow us
Naresh Gollana

| Edited By: Jyothi Gadda

Updated on: Jun 24, 2023 | 6:02 PM

ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కు పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ జిల్లా నుండి ఆదిలాబాద్ వెళుతుండగా.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కోర్టికల్ వద్ద జాతీయ రహదారిపై పశువుల మంద అడ్డుగా రావడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే వాహనం అదుపు తప్పి ఆవును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే చేతికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. కారు ప్రమాద సమయంలో ముందు వెనుక వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాయాలైన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ను స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు వాహనంలో నేరడిగొండ టోల్ ప్లాజా వరకు తరలించగా విషయం తెలుసుకున్న పోలీసులు.. ప్రత్యేక వాహనంలో ఎమ్మెల్యే ను బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా, జరిగిన ప్రమాదంలో రెండు పశువులు తీవ్రంగా గాయపడ్డాయి. ఎమ్మెల్యే వాహనం డ్రైవర్ కు గాయాలయ్యాయి. కార్‌లోని ఎమర్జెన్సీ బెలున్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఎమ్మెల్యే బాపురావు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, ఆయనకు మూడు చేతి వేళ్లు విరిగినట్టు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..