Viral Video: జింకను ప్రాణాపాయం నుంచి కాపాడిన వ్యక్తి.. తన బలగాన్ని దింపి మరీ థ్యాంక్స్ చెప్పిన డీర్..
ప్రమాదం చెప్పిరాదు. టైమ్ బ్యాడ్ అయినప్పుడు ప్రాణాపాయం ముంచుకొచ్చే ఛాన్స్ ఉంది. ఆ సమయంలో సేవ్ చేయడానికి ఎవరూ లేకపోతే.. ప్రాణ భయంతో విలవిల్లాడిపోతాం. ఎవరైనా వస్తే బాగుండు.. కాపాడితే బాగుండు అని ఆలోచిస్తాం. అదృష్టం కొద్ది ఎవరైనా వచ్చి కాపాడితే..
ప్రమాదం చెప్పిరాదు. టైమ్ బ్యాడ్ అయినప్పుడు ప్రాణాపాయం ముంచుకొచ్చే ఛాన్స్ ఉంది. ఆ సమయంలో సేవ్ చేయడానికి ఎవరూ లేకపోతే.. ప్రాణ భయంతో విలవిల్లాడిపోతాం. ఎవరైనా వస్తే బాగుండు.. కాపాడితే బాగుండు అని ఆలోచిస్తాం. అదృష్టం కొద్ది ఎవరైనా వచ్చి కాపాడితే.. దేవుడిలా వచ్చావంటూ కాస్త ఊపిరిపీల్చుకుంటాం. బతికి బయటపడితే.. అందుకు కారణమైన వారికి కృతజ్ఞతలు చెపుతాం. అవసరమైతే తమకు సాయం చేసిన వారి ఇంటికెళ్లి మరీ కృతజ్ఞతలు చెబుతాం. ఇది మనుషుల పరిస్థితి. మరి జంతువుల పరిస్థితి ఏంటి? జంతువులు కూడా అలాగే ఆలోచిస్తాయా? అంటే ఈ వీడియో చూస్తే అవుననే చెప్పాలి. మనుషులకే కాదు.. జంతువులకూ కృతజ్ఞతా భావం ఉంటుంది. అది ఎంతలా అంటే.. తన బంధు బలగాన్నంతా సాయం చేసిన వ్యక్తి ఇంటికి తీసుకొచ్చి మరీ కృతజ్ఞతలు చెప్పేంతగా. అవును.. ఓ జింక తన ప్రాణాలను కాపాడిన వ్యక్తి పట్ల మనుషుల కంటే ఎక్కువ విశ్వాసం చూపింది. తన బలగాన్నంతా అతని ఇంటికి తీసుకెళ్లి మరీ కృతజ్ఞతలు చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ జింక ఫెన్షింగ్ దాటేందుకు ప్రయత్నించి.. వైర్ మధ్యలో చిక్కుకుపోయింది. దాంతో అటు దూకలేక, ఇటు వెనక్కి రాలేక ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. ఇంతలో దానిని గమనించిన ఓ వ్యక్తి.. ప్రమాదంలో ఉన్న జింకను కాపాడారు. ఫెన్సింగ్ అవతలివైపు దానిని పంపించాడు. అతని చేసిన సాయానికి హమ్మయ్య అనుకున్న జింక అక్కడి నుంచి సంతోషంగా చెంగు చెంగుమంటూ వెళ్లిపోయింది. అయితే, అలా వెళ్లిన జింక.. తన పరివారాన్నంతా తీసుకుని, తనకు సాయం చేసిన వ్యక్తి ఇంటి వద్దకు వచ్చాయి. అతను తన ఇంటి డోర్ ఓపెన్ చేయగానే పదుల సంఖ్యలో జింకలు కనిపించాయి. వాటిని చూసి అతను షాక్ అయ్యాడు. సాయం చేసినందుకు కృతజ్ఞతగా ఇవన్నీ వచ్చాయని భావించాడు.
జింకలు కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంతనంద తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారు. జంతువుల కృతజ్ఞతా భావం చూసి ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోను కింద చూడొచ్చు..
Wild animals feel obliged. They have strong emotions?
Here the deer comes with his entire herd and expresses gratitude to the man who had saved him❤️ (WA fwd) pic.twitter.com/Y3L5tuOqJD
— Susanta Nanda (@susantananda3) March 26, 2023
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..