Warangal: శివమెత్తిన సిఐ.. లాఠీలతో వీరబాదుడు.. చిరువ్యాపారులను చితక్కొట్టాడు
మిల్స్ కాలనీ సిఐగా సురేష్ ఈ మధ్యే నూతనంగా బాధ్యతలు చేపట్టాడు ఈ అధికారి. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చిరు హోటళ్లపై మంగళవారం రాత్రి దాడిచేశాడు. పది తర్వాత షాపులు, హోటల్లు తెరిచి ఉంచొద్దని తన సిబ్బందితో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు.. హోటల్స్ నిర్వాహకులపై లాఠీలు ఝులిపించాడు.. కొందరికి ఒళ్ళు కమిలిపోయి వాతలు వచ్చేలా వీరబాదుడు బాది తన ప్రతాపాన్ని చూపాడు. త్వరలో సదరు సీఐకి ఛార్జ్ మెమో ఇస్తారా లేదా ఫస్ట్ టైమ్ కాబట్టి మందలించి వదిలేస్తారా అనేది చూడాలి.
ఆగస్టు 9: వరంగల్‌లో ఓ పోలీసు అధికారి శివమణిలా రెచ్చిపోయాడు. చిరు హోటళ్ల నిర్వాహకులపై తన ప్రతాపాన్ని చూపాడు. లాఠీలతో అతగాడి వీర బాదుడుకి.. బాధితులు ఒళ్ళు కమిలి పోయింది. అక్కడి వ్యాపారులకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవు.. కనీసం వారికి బీట్ పోలీసుల సూచనలు లేవు.. నా పోలీస్ స్టేషన్ పరిధిలో 10 తర్వాత హోటళ్ళు తెరిచి కనపడొద్దు అంటూ.. మిల్స్ కాలనీ PS కు కొత్త సిఐగా బాధ్యతలు చేపట్టిన సురేష్ వీరంగం సృష్టించాడు. బార్లు, వైన్ షాపులు అర్ధరాత్రి వరకు బారుగా తెరిచుకొని తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నా పట్టించుకోని ఆ పోలీస్ అధికారి చిన్నచిన్న హోటల్ నిర్వాకులపై శివమెత్తాడు.. 10 దాటితే హోటల్ తెరిచి కనపడద్దని లాఠీలతో విరుచుకుపడ్డాడు.. హోటల్ నిర్వాహకులను లాఠీలతో కుల్లపొడిచి తన ప్రతాపాన్ని చూపాడు.. ఒకటికాదు రెండు కాదు దాదాపుగా 10 కి పైగా చిరు హోటల్స్ నిర్వాకులపై ఆ సీఐ వీర ప్రతాపం చూపాడు.
మిల్స్ కాలనీ సిఐగా సురేష్ ఈ మధ్యే నూతనంగా బాధ్యతలు చేపట్టాడు ఈ అధికారి. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చిరు హోటళ్లపై మంగళవారం రాత్రి దాడిచేశాడు. పది తర్వాత షాపులు, హోటల్లు తెరిచి ఉంచొద్దని తన సిబ్బందితో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు.. హోటల్స్ నిర్వాహకులపై లాఠీలు ఝులిపించాడు.. కొందరికి ఒళ్ళు కమిలిపోయి వాతలు వచ్చేలా వీరబాదుడు బాది తన ప్రతాపాన్ని చూపాడు. ఎలాంటి ముందస్తు హచ్చరికలు లేకుండా ఆ సీఐ దూకుడు చూసి హడలెత్తిపోయిన హోటల్స్ నిర్వాహకులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వారి ఒళ్లంతా కమిలిపోయింది.
వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏవీ రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీసులపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది.. గౌరవం పెరిగింది.. కమిషనర్‌ను ప్రజలు తమ మనిషిలా భావిస్తున్న వేళ ఇలాంటి పోలీస్ అధికారుల అత్యుత్సాహం పట్ల విమర్శలు వెల్లువెట్టుతున్నాయి.. మిల్స్ కాలనీ CI సురేష్ ఓవర్ యాక్షన్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదుచేశారు బాధితులు. ఇలాంటి పోలీసుల అత్యుత్సాహం వల్ల పోలీసులపై అపనమ్మకం ఏర్పడే పరిస్థితి వచ్చిందని.. మిల్స్ కాలనీ CI దూకుడుపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యేకు కూడా బాధితులు పిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. త్వరలో సదరు సీఐకి ఛార్జ్ మెమో ఇస్తారా లేదా ఫస్ట్ టైమ్ కాబట్టి మందలించి వదిలేస్తారా అనేది చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..