TSRTC: రోడ్డెక్కిన తెలంగాణ ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు.. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ఛార్జీ ఎంతో తెలుసా.?

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త సర్వీసులను లాంచ్‌ చేస్తూ వస్తోన్న తెలంగాణ ఆర్టీసీ తాజాగా ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. లహరి పేరుతో తీసుకొచ్చిన ఈ బస్సులను అధికారులు సోమవారం ప్రారంభించారు. ప్రైవేటు బస్సులకు..

TSRTC: రోడ్డెక్కిన తెలంగాణ ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు.. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ఛార్జీ ఎంతో తెలుసా.?
Tsrtc
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 27, 2023 | 3:15 PM

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త సర్వీసులను లాంచ్‌ చేస్తూ వస్తోన్న తెలంగాణ ఆర్టీసీ తాజాగా ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. లహరి పేరుతో తీసుకొచ్చిన ఈ బస్సులను అధికారులు సోమవారం ప్రారంభించారు. ప్రైవేటు బస్సులకు పోటీగా ఆధునిక హంగులతో రూపొందించిన 16 ఏసీ స్లీపర్‌ కోచ్‌ బస్సులను ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తదితరుల సమక్షంలో ఈ బస్సులను టీఎస్ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

ఇదిలా ఉంటే ఈ బస్సులను ఆర్టీసీ.. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బళ్లి.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి. తమిళనాడులోని చెన్నై తదితర ప్రధాన మార్గాల్లో నడపనున్నారు. 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్‌ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్‌ 15తో మొత్తం 30 బెర్తులు ఉన్నాయి. అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ బస్సుల్లో ఫ్రీ వైఫైతో పాటు మొబైల్‌ చార్జింగ్‌, ప్రతీ బెర్త్‌ వద్ద రీడింగ్‌ ల్యాంప్‌ వంటి ఫీచర్లు అందించారు. అలాగే సెక్యూరిటీ కోసం రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా, సెక్యూరిటీ కెమెరాలను అందించారు. బస్సులో మంటలు చెలరేగితే అప్రమత్తం చేసే.. ఫైర్‌ డిటెక్షన్‌ అండ్‌ అలారం సిస్టంను ఏర్పాటు చేశారు.

ధరలు ఇలా ఉండనున్నాయి..

బీహెచ్‌ఈఎల్ నుంచి తిరుపతికి రూ.1750, ఎంజీబీఎస్ నుంచి తిరుపతికి రూ.1690, మియాపూర్ నుంచి బెంగళూరుకు రూ.1630, ఎంజీబీఎస్ నుంచి బెంగళూరుకు రూ.1580, మియాపూర్ నుంచి హుబ్బళ్లికి రూ.1510, ఎంజీబీఎస్ నుంచి హుబ్బళ్లికి రూ.1460, బీహెచ్‌ఈఎల్ నుంచి విశాఖపట్నాకి రూ.1920, ఎంజీబీఎస్ నుంచి విశాఖపట్నానికి రూ.1860, బీహెచ్‌ఈఎల్ నుంచి చెన్నై రూ.1910, ఎంజీబీఎస్ నుంచి చెన్నై రూ.1860గా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.