T.Congress: ఇక్కడే పుట్టా.. ఇక్కడి నుంచే పోటీ చేస్తా.. ఇద్దరు నేతల మధ్య టికెట్ ఫైట్.. కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు..

వరంగల్ పశ్చిమ టికెట్‌ కోసం కాంగ్రెస్ పార్టీలో డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్‌ రెడ్డి, జనగామ మాజీ DCC జంగా రాఘవరెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక్కడి నుంచే పోటీ చేసేది తానంటే.. తానంటూ..

T.Congress: ఇక్కడే పుట్టా.. ఇక్కడి నుంచే పోటీ చేస్తా.. ఇద్దరు నేతల మధ్య టికెట్ ఫైట్.. కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు..
Naini Rajender Reddy And Janga Raghava Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 27, 2023 | 4:37 PM

వరంగల్ కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. కొంత కాలంగా నివురుగప్పిన నిప్పులా సాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు సస్పెన్షన్ వరకూ వెళ్లింది. వరంగల్ పశ్చిమ టికెట్‌ పార్టీలో పెద్ద చిచ్చునే రేపింది. పశ్చిమ కాంగ్రెస్‌ టిక్కెట్టు నాదంటే విమర్శలు గుప్పించుకుంటున్నారు. గత వారం కాజీపేట 48వ డివిజన్‌లో రాజేందర్‌రెడ్డి, 63వ డివిజన్‌ రాఘవరెడ్డి హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర పోటా పోటీగా భారీ ప్రదర్శన నిర్వహించారు. కాజీపేట ప్రాంతంలో ఇద్దరు జిల్లా అధ్యక్షులు పాదయాత్ర చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. జంగా ఒక అడుగు ముందుకేసి పశ్చిమ టిక్కెటు నాదే.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే బరిలోకి దిగుతానని ప్రకటించారు.

నాయిని స్థానికుడు కాదని కామెంట్ చేశారు. దీనిపై రాజేందర్‌రెడ్డి మరింత తీవ్ర స్థాయిలో విమర్శించారు. జంగాకు మతి భ్రమించిందని, పక్క జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ గ్రూపులు కట్టి, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలోనే క్రమ శిక్షణ సంఘం షోకాజు నోటీసు జారీ చేసిందని.. అయినా తీరు మారలేదంటున్నారు.

హన్మకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్‌ రెడ్డి పశ్చిమం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. హైకమాండ్ నుంచి భరోసా లభించింది. అయితే ఇదే టైమ్‌లో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు జనగామ మాజీ DCC జంగా రాఘవరెడ్డి. పశ్చిమ నియోకవర్గ పరిధిలో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. పాదయాత్రలు, పార్టీ కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. అంతేకాదు ఈసారి వరంగల్ పశ్చిమ నుంచే పోటీ చేస్తానంటూ తనకు తానే ప్రకటించుకున్నారు జంగా రాఘవరెడ్డి.

అయితే, రాఘవరెడ్డి ప్రకటన సహజంగానే డీసీసీ ప్రెసిడెంట్ రాజేందర్‌రెడ్డికి కోపం తెప్పించింది. నా ఇలాకాలో నీ పెత్తనం ఏంటి అంటూ కొంతకాలంగా అగ్రహంతో ఊగిపోతున్నారు రాజేందర్ రెడ్డి. ఇదే విషయాన్ని హైకమాండ్ చెవిలోనూ వేశారు. అక్కడి నుంచి కూడా సానుకూల సంకేతాలు రావడంతో ఓ అడుగు ముందుకేసి రాఘవరెడ్డిని సస్పెండ్ చేశారు రాజేందర్‌రెడ్డి.

దీంతో జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆందోళన  మొదలైంది. రాఘవరెడ్డి సస్పెన్షన్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. టీవీ9 వేదికగా ఇద్దరూ తీవ్ర విమర్శలు చేసుకున్నారు. వ్యక్తిగత ఆరోపణల నుంచి మొదలు పెడితే.. రౌడీషీట్లు, అవినీతి, ప్రమాణాల వరకూ వెళ్లింది గొడవ. నన్ను సస్పెండ్ చేసే హక్కు రాజేందర్ రెడ్డికి ఎక్కడిది అంటూ ప్రశ్నించారు జంగా. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడింది రాజేందర్ రెడ్డే అంటూ వమి రాఘవరెడ్డి. రాజేందర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని హైకమాండ్‌కు లేఖ రాస్తానని అన్నారు. నాకు ఇప్పటివరకు ఎలాంటి షోకాజ్ నోటీసులు రాలేదన్నారు రాఘవరెడ్డి.  తాను వరంగల్‌లోనే పుట్టా.. ఇక్కడే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎవరు అమ్ముడుపోయారో ప్రజలకు తెలుసంటూ విమర్శించారు.

వీరి గొడవతో ఇప్పుడు వరంగల్ జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ఈ ప్రభావంతో పార్టీ కెడర్ రెండుగా విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరి తెలంగాణ వార్తల కోసం