TSRJC CET 2023: టీఎస్‌ఆర్‌జేసీ సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే
తెలంగాణ గురుకుల జూనియర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌కు దరఖాస్తుల గడువును పొడిగించింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం..
తెలంగాణ గురుకుల జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌కు దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నేటి (మార్చి 31వ తేదీ)తో ముగియనుండగా దాన్ని ఏప్రిల్ 15 వరకు పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ ప్రకటించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవల్సిందిగా సూచించారు.
కాగా టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష-2023 మే 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని 35 జూనియర్ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.