Hyderabad: హైదరాబాద్ లో విషాదం..పని ఒత్తిడి తట్టుకోలేక సాప్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే మంచి జీతం ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ పని ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా చేసుకున్నాయి.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే మంచి జీతం ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ పని ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చేసే పనిలో ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి అల్కాపూర్ టౌన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గుంటూరుకి చెందిన వినోద్ కుమార్ (32) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా గుంటూరు నుంచే పని చేశాడు. కానీ ఈ మధ్య ఆఫిస్ కు వెళ్లి రావాల్సి ఉండటంతో అల్కాపూర్ లోని తన సోదరుని ఇంట్లో ఉంటూ పనికి వెళ్తున్నాడు.
అయితే ఉద్యోగ నిర్వహణలో భాగంగా కొత్త టూల్స్ వస్తుండటంతో వినోద్ వాటిపై పట్టు సాధించలేకపోయాడు. ఈ విషయంపై తన సోదరుడితో కూడా తరచూ చర్చించేవాడు. తాను చేసే ఉద్యోగంలో పని ఒత్తడి, ఉద్యోగ భద్రత కూడా లేదని భావించిన వినోద్ గురువారం సోదరుడు అతని భార్య బయటకు వెళ్లటంతో ఇంట్లో ఉరివేసుకున్నాడు. ఈ తర్వాత ఇంటికి వచ్చిన సోదరుడు వినోద్ ను ఆసుపత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వినోద్ కు భార్య, మూడేళ్ల కుమార్తె ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.