TREIRB Gurukula Answer Key: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ గురుకుల టీచర్‌ పరీక్షలు.. వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ ‘కీ’

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకులాల్లో దాదాపు 9,210 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ విధానంలో (సీబీఆర్‌టీ) నిర్వహిస్తోన్న రాత పరీక్షలు బుధవారం (ఆగస్టు 23)తో ప్రశాంతంగా ముగిశాయి. గురుకుల టీచర్‌ నియామక పరీక్షలు ఈ నెల 1న ప్రారంభంకాగా ఆగస్టు 23వ తేదీతో పరీక్షలు ముగిశాయి. దాదాపు 19 రోజుల పాటు రోజుకు మూడు షిఫ్టుల చొప్పున ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 104 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు..

TREIRB Gurukula Answer Key: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ గురుకుల టీచర్‌ పరీక్షలు.. వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ 'కీ'
TREIRB Gurukula Answer Key
Follow us

|

Updated on: Aug 24, 2023 | 9:20 AM

హైదరాబాద్‌, ఆగస్టు 24: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకులాల్లో దాదాపు 9,210 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ విధానంలో (సీబీఆర్‌టీ) నిర్వహిస్తోన్న రాత పరీక్షలు బుధవారం (ఆగస్టు 23)తో ప్రశాంతంగా ముగిశాయి. గురుకుల టీచర్‌ నియామక పరీక్షలు ఈ నెల 1న ప్రారంభంకాగా ఆగస్టు 23వ తేదీతో పరీక్షలు ముగిశాయి. దాదాపు 19 రోజుల పాటు రోజుకు మూడు షిఫ్టుల చొప్పున ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 104 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు 6,52,413 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 4,93,727 మంది మాత్రమే హాజరయ్యారు. పరీక్షలకు సగటున హాజరైన అభ్యర్థుల శాతం 75.68గా నమోదైనట్లు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) వెల్లడించింది.

కాగా తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఒకేసారి తొమ్మిది నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 56 విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేవలం 19 రోజుల్లో పకడ్భందీగా బోర్డు నిర్వహించింది. పరీక్షల ప్రారంభానికి ముందు 28 రకాల నిబంధనలను జారీ చేసింది కూడా. అత్యంత ప్రణాళికా బద్ధంగా పరీక్షలు నిర్వహించిన టీఆర్‌ఈఐఆర్‌బీ ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా విజయవంతంగా నియామక పరీక్షల ప్రక్రియను పూర్తి చేసింది. గురుకుల బోర్డు నిర్వహించిన పరీక్షలన్నీవన్నీ ఆన్‌లైన్‌ ఆధారితమైనవేకావడంతో మూల్యాంకన ప్రక్రియ వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది.

గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’లు అందుబాటులోకి తెచ్చింది. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్‌ ఉద్యోగాలకు సంబంధించి మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లు, ఆన్సర్‌ కీలను మాత్రం వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టలేదు. కోర్టులో కేసు నడుస్తుండటంతో వీటిని పెట్టలేదని సమాచారం. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఆన్సర్‌ కీపై 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. అనంతరం ఈ నెలాఖరు నాటికి తుది కీ ఖరారు చేసి ఫలితాలను విడుదల చేస్తారు. ఇందులో భాగంగా టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన కీని బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.