Telangana: గుండెపోటుతో హఠాత్తుగా కుప్పకూలిన బిల్డర్‌.. అంతా క్షణాల్లోనే..

సినీ ప్రముఖులే కాదు రోజు వారీ పనులు చేసుకునే సామాన్యులు సైతం ఆకస్మిక గుండోపోటుతో మృతి చెందుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బిల్డర్‌ హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు..

Telangana: గుండెపోటుతో హఠాత్తుగా కుప్పకూలిన బిల్డర్‌.. అంతా క్షణాల్లోనే..
Telangana News
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 05, 2023 | 12:02 PM

సినీ ప్రముఖులే కాదు రోజు వారీ పనులు చేసుకునే సామాన్యులు సైతం ఆకస్మిక గుండోపోటుతో మృతి చెందుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బిల్డర్‌ హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. గత శుక్రవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. బిల్లర్‌ గోదావరిఖనిలోని ఓ అపార్టుమెంటులో నివసిస్తున్న శైలేందర్‌ సింగ్‌ (47) అనే వ్యక్తి బిల్డర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం (మార్చి 3) ఉదయం వేములవాడలోని తన సోదరుడి వద్దకు వెళ్లేందుకు బ్యాగ్‌తో బయటకు వచ్చి తాళం వేశాడు. లిఫ్ట్‌ వద్దకు వెళ్లి బటన్‌ నొక్కి ఛాతీ వద్ద రుద్దుకుంటూ నిలబడ్డాడు.

ఆ తర్వాత చేతిలోని బ్యాగ్‌ పక్కన పెట్టి, ఇబ్బందిగా బయటకు చూస్తూ ఉండగా కేవలం సెకన్ల వ్యవధిలోనే ఆయన వెనక్కి పడిపోయి మృతి చెందారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీటీవీ రికార్డింగ్‌ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. శనివారం సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా బయటపడింది. ఎంతో ఆరోగ్యంగా ఉండే శైలేందర్‌ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌కు సోదరుడు. ప్రస్తుతం బిల్డర్‌ శైలేందర్‌ సింగ్‌కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.