Telangana: అక్షర జ్ఞానం లేకపోయినా అద్భుతాలు.. ప్లాస్టిక్ వ్యర్థాలతో భళారే అనిపిస్తోన్న గ్రామీణ శాస్త్రవేత్తలు

అద్భుతాలు సృష్టించడానికి ఉన్నత విద్యా అవసరంలేదు.. దమాక్ ఉన్నాడో ధునియా మొత్తం యేల వచ్చు అనడానికి ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే ఉదాహరణ చెప్పవచ్చు. సాధారణంగా పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో నిత్యం లక్షలాది ప్లాస్టిక్ బాటిల్స్ వృధాగా పారేస్తుంటాం.. అవి భూమిలో కలిసిపోయి పర్యావరణానికి ఎంతో ముప్పు తలపెడుతున్నాయి. కానీ అక్షరజ్ఞానం లేకపోయినా మారుమూల ఏజెన్సీలోని ఓ గ్రామస్తులు ప్లాస్టిక్ బాటిల్స్ తో చేసిన ప్రయోగం బలా అనిపిస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ తో వారి ఇంటి ముందు దడికి నందనవనం తయారు చేశారు.. ఆ బాటిల్స్ లో సగభాగంలో పూల..

Telangana: అక్షర జ్ఞానం లేకపోయినా అద్భుతాలు.. ప్లాస్టిక్ వ్యర్థాలతో భళారే అనిపిస్తోన్న గ్రామీణ శాస్త్రవేత్తలు
Plants In Plastic Bottles
Follow us

| Edited By: Vimal Kumar

Updated on: Sep 08, 2023 | 12:10 PM

ములుగు జిల్లా, ఆగస్టు 23: అద్భుతాలు సృష్టించడానికి ఉన్నత విద్యా అవసరంలేదు.. దమాక్ ఉన్నాడో ధునియా మొత్తం యేల వచ్చు అనడానికి ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే ఉదాహరణ చెప్పవచ్చు. సాధారణంగా పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో నిత్యం లక్షలాది ప్లాస్టిక్ బాటిల్స్ వృధాగా పారేస్తుంటాం.. అవి భూమిలో కలిసిపోయి పర్యావరణానికి ఎంతో ముప్పు తలపెడుతున్నాయి. కానీ అక్షరజ్ఞానం లేకపోయినా మారుమూల ఏజెన్సీలోని ఓ గ్రామస్తులు ప్లాస్టిక్ బాటిల్స్ తో చేసిన ప్రయోగం బలా అనిపిస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ తో వారి ఇంటి ముందు దడికి నందనవనం తయారు చేశారు.. ఆ బాటిల్స్ లో సగభాగంలో పూల మొక్కలు పెట్టి ఊరంతా గార్డెన్ లా తయారు చేశారు.

ఈ విచిత్ర దృశ్యం ములుగు జిల్లా వాజేడు మండలం బొల్లారం గ్రామంలో కనిపించింది..ఈ గ్రామంలో అందరూ వ్యవసాయం పైనే ఆధారపడి నివశిస్తుంటారు.. వీరిలో ఎక్కువ శాతం మంది గిరిజనులే ఉన్నారు.. కానీ ప్లాస్టిక్ సద్వినియోగంపై గొప్ప గొప్ప మేధావులకు కూడా రాని ఆలోచన ఈ గిరిపుత్రులకు వచ్చింది.. ప్లాస్టిక్ బాటిల్స్ వృధాగా పారేస్తే ఏమొస్తుంది.. అవి భూమిలో కలిసి పోయి మనిషి మనుగడకు ముప్పు వస్తుందని భావించిన గిరిజనులు ఆ ప్లాస్టిక్ బాటిల్స్ ను ఇలా ఉపయోగించారు.

స్ప్రైట్‌ బాటిల్ సగభాగం కట్ చేసి మరో సగభాగంలో పూల మొక్కలు పెంచుతున్నారు..ఇందులో రకరకాల కలర్ ఫుల్ పూల మొక్కలు ఏర్పాటు చేసి ఇంటి ముందు దాడికి అలంకరణ చేశారు.. నిత్యం ఆ బాటిల్స్ లో నీళ్లు పోసి మొక్కలను పెంచుతున్నారు. ఈ ఊర్లో ఏ ఇంటి ముందుచూసినా ఇదే రకంగా ప్లాస్టిక్ బాటిల్స్ లో మొక్కలు కనిపిస్తాయి. రకరకాల పూలతో కలర్ ఫుల్ గా దడికి వేలాడుతున్న ప్లాస్టిక్ బాటిల్స్ చూస్తే ఎలాంటి వారైనా ఆశ్చర్య పోవాల్సిందే.. అక్షరజ్ఞానం లేని ఈ గ్రామీణ ప్రజల మేధాశక్తిని చూసి ఎవరైనా అవాక్కవ్వాల్సిందే..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.