Hyderabad: ‘నువ్వు ఎస్సై అయితే నాకేంటి.. మార్‌ డాల్లుంగా’ ఎస్సైని చితకబాదిన యువకుడు

యూనిఫాంలో ఉన్న ఎస్సై పై పలువురి యువకులు విచక్షణ కోల్పోయి దాడి చేశారు. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలనగర్ ఎస్వోటీ ఎస్సైగా పనిచేస్తున్న కిషోర్ పై నలుగురు యువకులు దాడికి తెగబడ్డారు..

Hyderabad: 'నువ్వు ఎస్సై అయితే నాకేంటి.. మార్‌ డాల్లుంగా' ఎస్సైని చితకబాదిన యువకుడు
youth assaulted on SI
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Srilakshmi C

Updated on: Aug 24, 2023 | 12:43 PM

హైదరాబాద్‌, ఆగస్టు 24: యూనిఫాంలో ఉన్న ఎస్సై పై పలువురు యువకులు విచక్షణ కోల్పోయి దాడి చేశారు. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలనగర్ ఎస్వోటీ ఎస్సైగా పనిచేస్తున్న కిషోర్ పై నలుగురు యువకులు దాడికి తెగబడ్డారు. బుధవారం రోజు రాత్రి ఎదురు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మేడ్చల్ నుంచి కొంపల్లి సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న ఎస్ఐ కారుని పక్కనే నడుచుకుంటూ వస్తున్న ఒక యువకుడు అడ్డగించాడు. అనవసరంగా కారు ఆపే ప్రయత్నం చేయడమే కాకుండా చిన్నగా వెళ్లాల్సిందిగా ఎస్సైని యువకుడు దబాయించాడు. దీంతో కారు పక్కకు ఆపాడు ఎస్సై కిషోర్. తాను ఎస్‌ఓటి ఎస్సై అని, తనను ఎందుకు తిడుతున్నారని ఆ యువకుడిని ఎస్ఐ ప్రశ్నించాడు.!!! దీంతో తన స్నేహితులను పిలిచిన యువకుడు ఒక్కసారిగా ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నువ్వు ఎస్సై అయితే నాకేంటి..? మార్ డాల్లుంగా’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా ఎస్ఐ ఫోన్ తో పాటు ఐడి కార్డును లాక్కున్నారు. ఎస్ఐపై కాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

చుట్టుపక్కల స్థానికులందరూ రావడంతో ఎస్ ఐ ను వదిలిపెట్టిన ముగ్గురు యువకులు అక్కడి నుండి పారిపోయారు.. స్థానికుల ద్వారా ముగ్గురు వివరాలు సేకరించిన ఎస్సై వారిపై మేడ్చల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు.. షేక్ ఇర్ఫాన్, జుబేర్, జావిద్ పై మేడ్చల్ పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఎస్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు మేడ్చల్ పోలీసులు. మేడ్చల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 577 కింద కేసు నమోదు చేసి ముగ్గురు యువకులపై ఐదు సెక్షన్లో కింద కేసు నమోదు చేశారు. యువకులదాడిలో గాయపడిన ఎస్సై చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.