TS Eamcet 2023 Results: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇక్కడ చెక్‌ చేసుకోండి

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాలు గురువారం (మే 25) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఈ రోజు ఉదయం 9:30 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 80 శాతం , అగ్రకల్చర్‌లో 86 శాతం శాతం మంది ఉత్తీర్ణత..

TS Eamcet 2023 Results: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇక్కడ చెక్‌ చేసుకోండి
TS Eamcet 2023 Results
Follow us
Srilakshmi C

|

Updated on: May 25, 2023 | 11:57 AM

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాలు గురువారం (మే 25) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఈ రోజు ఉదయం 9:30 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 80 శాతం , అగ్రకల్చర్‌లో 86 శాతం శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య లింబాద్రి, ఎంసెట్‌ ఛైర్మన్‌ కట్టా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://tv9telugu.com/లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

స్థానిక కోటా కింద రాష్ట్ర అభ్యర్ధులకు 85 శాతం కోటా ఉవ్వనున్నారు. మిగిలిన 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు కేటాయించనునున్నారు. ఇంటర్‌ వెయిటేజీ రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ర్యాంకు, కోర్సు, అందుబాటులో ఉన్న సీట్లు ఆధారంగా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అడ్మిషన్లు ఉంటాయి.

కాగా మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరిగాయి. దాదాపు 3.20 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,01,789 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్‌ ఇంజీనిరింగ్‌కు 1,95,275 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్‌ (అగ్రికల్చర్‌) కు 1,06,514 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 94.11 శాతం విద్యార్దులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

ఎంసెట్‌ (అగ్రికల్చర్‌, ఇంజనీరింగ్‌) తుది ఆన్సర్‌ కీలు కూడా విడుదల చేశారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ త్వరలోనే విడుదల చేస్తారు. మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు. ర్యాంకులు సాధించిన వారు ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనవల్సి ఉంటుంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.