Father Murder: సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయించిన కూతురు.. కఠిన నిర్ణయం వెనుక అంతులేని ఆవేదన

తల్లిని, తనను నిత్యం వేధిస్తున్నాడనీ.. ఓ కూతురు (35) తండ్రి హత్యకు సుపారీ ఇచ్చిమరీ మనుషులను పురమాయించి అంతమొందించింది. దీంతో నాగ్‌పూర్ పోలీసులు బుధవారం ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు. వివరాల్లోకెళ్తే..

Father Murder: సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయించిన కూతురు.. కఠిన నిర్ణయం వెనుక అంతులేని ఆవేదన
Father's Murder Case
Follow us
Srilakshmi C

|

Updated on: May 25, 2023 | 7:22 AM

తల్లిని, తనను నిత్యం వేధిస్తున్నాడనీ.. ఓ కూతురు (35) తండ్రి హత్యకు సుపారీ ఇచ్చిమరీ మనుషులను పురమాయించి అంతమొందించింది. దీంతో నాగ్‌పూర్ పోలీసులు బుధవారం ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు. వివరాల్లోకెళ్తే..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తికి భార్య, కూతురు ఉన్నారు. అతను మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని నిత్యం భర్యను, కూతురిని వేధించసాగాడు. తన భార్య పేరున ఉన్న పెట్రోల్ పంప్, పొలం, ఇంటిని తన పేరు మీద బదిలీ చేయవల్సిందిగా కోరుతూ నిత్యం ఆమెను హింసించేవాడు. ఈ క్రమంలో మే 2న భార్య, కుమార్తెపై దారుణంగా దాడి చేశాడు. దీంతో విసిగిన కూతురు తండ్రిని అంతమొందించేందుకు పథకం పన్నింది. దీనిలో భాగంగా తండ్రి హత్యకు స్థానికంగా ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌కి రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకుంది.

మే 17న నాగ్‌పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భివాపూర్‌లోని తమ పెట్రోల్ పంపు వద్ద కాంట్రాక్ట్‌ కిల్లర్‌, అతని అనుచరులు ఆమె తండ్రిని కత్తితో పొడిచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కాంట్రాక్ట్ కిల్లర్‌ను అరెస్టు చేసి, తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. మృతుడి కుమార్తె సుపారీ ఇచ్చి హత్య చేయించిన విషయం బయటపెట్టడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.