TS CPGET 2023 Results: తెలంగాణ సీపీగెట్ 2023 ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టెస్ట్ (సీపీగెట్)-2023 ఫలితాలు మంగళవారం (ఆగస్టు 22) ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలు విడుదల చేశారు. ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వైబ్‌సైట్ cpget.tsche.ac.in నుంచి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉస్మానియా వర్సిటీ, కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ వర్సిటీ, శాతవాహన వర్సిటీ, తెలంగాణ ఉమెన్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ..
హైదరాబాద్, ఆగస్టు 23: తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టెస్ట్ (సీపీగెట్)-2023 ఫలితాలు మంగళవారం (ఆగస్టు 22) ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలు విడుదల చేశారు. ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వైబ్‌సైట్ నుంచి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉస్మానియా వర్సిటీ, కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ వర్సిటీ, శాతవాహన వర్సిటీ, తెలంగాణ ఉమెన్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్‌తో సహా మొత్తం 8 యూనివర్సిటీల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్, పీజీ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. సీపీగెట్ – 2023లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఈ 8 యూనివర్సిటీల్లో దాదాపు 45 కోర్సుల్లో కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సీపీగెట్ – 2023 ప్రవేశ పరీక్షలు జూన్ 30 నుంచి జులై 10 వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60,443 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) MTS టైర్ 1 అడ్మిట్ కార్టులు విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 22న నిర్వహించనున్న ఎంటీఎస్ 2023 టైర్ 1 రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (సీబీఐసీ అండ్ సీబీఎన్) ఎగ్జామినేషన్ – 2023 రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎస్సెస్సీ సూచించింది. వచ్చేనెల (సెప్టెంబర్) 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. టైర్ 1 పరీక్షలో మెరిట్ కనబరచిన వారికి మాత్రమే టైర్ 2 పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది.
హైదరాబాద్ ఈఎస్‌ఐలో తొలిసారి ట్రాన్స్‌జెండర్‌కు పీజీ మెడికల్ సీటు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐలో తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్ వైద్య విద్యార్ధికి పీజీ మెడికల్ సీటు లభించింది. ఖమ్మంకు చెందిన డాక్టర్ రుత్‌పాల్ జాన్ అయినవారు ఎవరూలేని ఓ అనాథ. నా అనేవారు ఎవరూ లేకపోయినా పట్టుదలతో చదివది ఎంబీబీఎస్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలోని ఏఆర్‌టీ సెంటర్‌లో మానసిక, శారీరక సమస్యలతో వచ్చే ఎందరో తనలాంటి ట్రాన్స్‌జెండర్‌కు వైద్యం అందిస్తున్నారు. ఉన్నత చదువులు అభ్యసించాలనేది డాక్టర్ రుత్‌పాల్ కష్టపడి చదివి పీజీ నీట్‌లో ర్యాంకు సాధించారు. నీట్ ర్యాంకు ఆధారంగా హైదరాబాద్ ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీలో ఎండీ ఎమర్జెన్సీ కోర్సులో సీటు సాధించారు. అందుకు ఫీజు కింద రూ.2.50 లక్షల వరకు అవసరమవ్వగా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, ఇతర వైద్య సిబ్బంది రూ.లక్ష వరకు సాయం చేశారు. మిగిలిన రూ.1.5 లక్షల నగదు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఎస్‌ఈఈడీ స్వచ్ఛంద సంస్థలు అందించడానికి ముందుకొచ్చాయి. తాను నేర్చుకున్న విద్యతో నిరు పేదలకు సేవ చేస్తానని డాక్టర్ రుత్‌పాల్ మీడియాతో తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.